*గణపతిప్రార్ధన ;-: *ఎం. వి. ఉమాదేవి నెల్లూరు*
 ఉత్పల మాల 
వేగము బ్రోవుమయ్య మము వేడితి మిమ్ముల విఘ్ననాయకా 
భోగము లేవిగోరమిక భూరియు దాతవు నీవెమాకుగన్ 
జాగునె యుల్లమందునను జాలియులేకనె  జేయరాదుమీ 
వేగుగ బంపిజూడవయ వేచితి బాధలె  కార్తికేయునిన్ !!
(ఆట వెలది )
పాలవెల్లిగట్టి పండ్లు చెరుకులును 
పాలు బోసి వండి పాయసమ్ము
పత్రిపూజజేసి పళ్లెరముననుబెట్టె 
పూర్ణకుడుములన్ని పొందుగాను !!

కామెంట్‌లు