వారధినిర్మాణంలో వానరవీరులు. పురాణ బేతాళ కథ.;- డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్న బేతాశుని బంధించి మౌనంగా నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు 'మహారాజా నీపట్టుదల అభినందనీయమే! నాకు వారథి నిర్మాణంలో పాల్గొన్న వానరవీరుల వివరం తెలియజేయి,ఆవివరం రావణుడు కు ఎలాతెలిసింది.నీకు తెలిసి చెప్పకపోయివో మరణిస్తావు'అన్నాడు.
' బేతాళా లంకానగరానికి శ్రీరాముడు దారికోరగా,సముద్రుడు
"శ్రీ రామచంద్ర నీవానరసైన్యంలో నలుడు,నిలుడు అనేఇరురువురు వానరవీరులు ఉన్నారు.వీరుబాల్యంలో మునిఆశ్రమాలలోని పూజాసామాగ్రిని నీటిలో వేస్తూ ఆడుతుండేవారు.వీరిఅల్లరి భరింపలేని మునులువీరుఏవస్తువునీటిలోవేసినాతేలేవిధంగాశపించారు.వారిచేతులమీదుగానీటిపై ఏవస్తువు వేసినాతేలుతుందికనుక వారిచేవారధి నిర్మింపజేయి. ప్రతి రాయిపైన శ్రీరామనామం ఉండేలా చూడండి ఆరాళ్లు చెదరిపోకుండానేను సహకరిస్తాను"అన్నాడు.వెంటనే సమరఉత్సహంతో కోట్లాది వానరులు బండరాళ్లుతెచ్చి వాటిపై రామనామం రాసి వారధినిర్మాణం ప్రారంభించారు.
అక్కడలంకలో..శుకుడు,సారణుడు అనే సేవకులు శ్రీరాముని సైన్య బలాన్ని వివరించడానికి సకల సైనిక అధిపతులతో రావణుని లంకా నగరం వెలుపల సువేలాద్రి పర్వతంపై నిలిపి "ప్రభూ వారధి నిర్మాణం పనులు పరివేక్షించేవాడే నీలుడు,వాడిసరసన రాళ్లనుపేర్చుతున్నవాడే నలుడు.వాడివెనుక వెండికొండలా నిలిచిఉన్నవాడే శ్వేతుడు. అలాచూడండి సుగ్రీవునికి కుడిభాగాన ఉన్నవాడు కుముదుడు. ఎడమభాగానఉన్నవాడు రంభుడు. వారి వెనుకభాగానఉన్నవాడు క్రొధనుడు. నీలిమేఘశరీరంకలిగినవాడు భల్లుకుడుఅయిన ధూమ్రుడు.అతనికికుడిభాగాన ఉన్నవాడు అతనితమ్ముడు జాంబవంతుడు.ఉత్సహంతో శ్రీరామనామాన్ని ప్రతిధ్వనింపజేస్తూ వానరులను ఉత్సహపరుస్తున్నవాడు దంభుడు. ఆపక్కనేసన్నా దనుడు.అతనికి కుడి ఎడమల క్రధనుడు,ప్రమాధి,ఆపక్కన ఉన్నవారు గవాక్షుడు,కేసరి,శతబలి.అదిగో మేరుపర్వతశరీరుడు హనుమంతుడు. అతనిఎదరుగా పద్మపత్రనేత్రుడు, వేదవేత్త,సకలఅస్త్రనిపుణుడు లక్ష్మణుడు. అతనికుడిభాగాన ఉన్నఅరుణముఖ తేజోమయుడు, అరివీరభయంకరుడు, మృత్యువునేశాసించగలిగినవాడు శ్రీరాముడు. అతనిఎదరుగా తమరి సోదరుడు విభీషణుడు.అతనిఎడమభాగాన మెడలో కాంచనమాలతో ఉన్నవాడు సుగ్రీవుడు.వీరంతా ప్రభుభక్తిపరులే ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి పోరాడే వానరయోదులు.సమరోత్సహంతో వారుచేస్తున్న రామనామ ఘోష తమచెవులకువినిపిస్తునేఉంది. ప్రభుభక్తిపరాయణులైనవానవీరులురేయింబవళ్లు శ్రమించి వారధినిర్మాణం చేస్తున్నా వారందరిలో అలసట అనేది కనిపించక పోవడం ఆశ్చర్యం.మేముగూఢాచర్యంచేసేది పసికట్టిన విభీషణుడు మమ్మల్ని పట్టిరాముని ఎదుట నిలబెట్టగా ప్రణభిక్షపెట్టి వదిలమన్నాడు దూతను చంపరాదని  శ్రీరాముడు."అని విన్నవించాడు వేగు సారణుడు. "ఈవివరాలుచాలు మీరు వెళ్లండి"అన్నాడురావణుడు'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగం కావడంతో శవంతో సహా మాయమై తిరిగి చెట్టుపైకి చేరాడు బేతాళుడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళుని కొరకు వెనుతిరిగాడు.

కామెంట్‌లు