బ్రతుకుబాట :- *నన్నెవరేమనుకున్నా*;-కోరాడ నరసింహా రావు

  ***    106    ***
 ఈ సమాజంలో... ఒక్కొక్కరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది !
ఒక వ్యక్తి యొక్క ఆలోచనా సరళి ఆయా వ్యక్తులయొక్క పుట్టి, పెరిగిన వాతావరణం, 
సామాజిక, ఆర్ధిక పరిస్థితులు చుట్టూవున్నపరిసరాలు,ఉపాధ్యాయులు, స్నేహాలు వీటన్నిటి మూలంగా ఏర్పడ్డసంస్కారాలు
వీటన్నిటిప్రభావాల  మీదా ఆధారపడి ఏర్పడుతుంది  ! 
ఒక్కొక్కరిదీ ఒక్కో మనోగతం,
ఒక్కోఅభిమతం,వీటినికులమతాలు కూడా బ్రభావితం చేస్తాయి అనటం అతిశయోక్తి కాదు ! చక్కని చదువుతో ఉత్తమసంస్కారాన్ని
అలవరచుకున్నందున  సత్ జ్ఞానము కలిగి, , వివేకము అబ్బిన యే కొందరో... 
వీటన్నిటికీ అతీతంగా... విశ్వమానవ సౌభ్రాతృత్వం తో సమతా విధానాన్ని ఆమోదిoచ  గలరేమో గానీ..., చాలావరకూ 
కుల, మత, వర్గ సంకుచితత్వా లతోనే ప్రాకులాడుతారు !
నా భవానీ స్టూడియోకి అనేక రకాల మనస్తత్వాల వ్యక్తులు వచ్చి పోతుండేవారు !
నేను యే తత్వానికీ వ్యతిరేకిని కాను !
ఎందుకంటే నాకు తెలుసు... 
ప్రతీ తత్వమూ మానవ జీవన వికాసానికి, ఆనందమయ జీవ 
నానికీ పుట్టి, ప్రతిపాదించ బడి నవే !
ఐతే మాటల సందర్భంలో... 
వారి -  వారి మతాలు, అభిమతాలలో అపసవ్యాలు కనిపించినప్పుడు, ఖండించ కుండా ఉండలేని మనస్తత్వం నాది,..!యదార్ధవాది, లోకవి రోధే కదా.. !
ఏకులము, ఏమతము, ఏ వర్గము, ఏ వాదము వారితో చర్చ జరిగినా ఎవరికి వారు, వారంతా వీడు మాకులానికి, 
మామతానికి, మావర్గానికి, మా అభిమతాలకూ వ్యతిరేకి..., 
వీడు మా మనిషి కాడు, వైరివర్గము వాడు అనుకునే వారు !
ఎవరేమనుకున్నా... వారంతా అనుకుంటున్నట్టు నేనెవరికీ యే అభిమతానికీ వ్యతిరేకిని కాను, అందరికీ ఆత్మీయుడనే !
షిరిడీ సాయిబాబా దేవుడు కాడు, అతడసలు సాధువే కాడు, అతడొక ఫకీర్, అతడినెవరూ పూజించవద్దు,
అతడి ఫోటోలు ఎవరిళ్ళలోనూ పెట్టుకోవద్దు అని మనదేశం లోనే అత్యు న్నత పీఠాధిపతి ఒకాయన అంటూ వివాదానికి తెర తీసినప్పుడు , నేను సహించలేక అతనిని... తేరగాతిని,తెగబలిసి నోటితీట తో ప్రశాంతంగా సాగిపోతున్న సమాజంలో కల్లోలాలు సృష్టించ టానికి ప్రేలే ప్రేలాపనలుమానుకోండి అని  నేను ఖండించకుండా ఉండ  లేకపోయాను !
కోమటోళ్లందరూ దొంగలు అని 
కంచె ఐలయ్య సామాజిక విబేధాలు సృష్టించినపుడు, 
సూటుబూటుల్లో ధగ, దగా మెరిసిపోతున్న దళిత దొరా !
ఈ సమాజంలో కేవలం కోమ టోళ్లే వ్యాపారాలు చెయ్యటం లేదయ్యా...ఈ సమాజంలో శక్తి, యుక్తి కలిగి దోచుకొన
వీలుచిక్కిన ప్రతివాడూ దోచుకుంటున్నాడు !
మీ చదువు, సంస్కారాలను తెలివితేటలను దేశ సమగ్రతకు 
సౌభ్రాతృత్వానికివినియోగించండి,కల్లోలాలు సృష్టించటానికి కాడు ! అని నా అభిప్రాయాన్ని నిక్కచ్చిగా తెలియ జెప్పాను !
సీత, రాముడి దగ్గరకన్నా రావణుడిదగ్గరే బెటర్ అంటూ  కత్తి  మహేష్ హిందూ పురాణా లను,హిందువుల పవిత్ర అభిప్రాయాలనూ ఎగతాళి చేస్తున్నప్పుడు..., ఇంకా నాస్తికులు హిందూ భావజాలాన్ని తృణీకరిస్తూ తప్పుపడుతున్నపుడు... ఇలా 
ఎన్నో మార్లు... 
అది యే మతమని కాదు ,యే  కులమని కాదు , ఏ వర్గమని కాదు ... ఎవరు, ఎక్కడ, ఎప్పుడు అప సవ్యముగా వాదించినా నేను ఖండించకుండా ఉండలేక పోతున్నాను !
వాళ్లంతా అనుకుoటున్నఎవరొ ఒకరికి చెందిన  ఏ ఒక్కడినీ నేను కాను ! 
నేనొక సాధారణ భారతీయ పౌరుడను !అన్నికులాలవాళ్ళు 
అన్నిమతాలవాళ్ళు, అన్ని వర్గాలవాళ్ళు... అన్నివాదాల వాళ్ళు, అందరూ నావాళ్ళే !
నేనెవరికీ శత్రువును కాను, 
అందరూ నాకు మిత్రులే !!
      ******
..........     సశేషం     ..........
కామెంట్‌లు