పురుడు. పురాణ బేతాళ కథ.;- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించిఉన్న బేతాళుని బంధించి భుజంపై చేర్చుకుని మౌనంగా బయలు దేరాడు.అప్పుడు శవంలోని బేతాళుడు 'మహారాజా నీపట్టుదల అభినందనీయమే,నాకు పురుడు గురించి తెలియజేయీ.తెలిసి చెప్పకపోయావోమరణిస్తావుఅన్నాడు.
' బేతాళా భాగవత పురాణంలోని తొమ్మిదవ పుస్తకం పంతొమ్మిదవ అధ్యాయంలో పూరుడికి కుయాడు, తుర్వాసు, ద్రుహ్యూ, అను అనే నలుగురు సోదరులు ఉన్నట్లు వర్ణించబడింది. యయాతికి శుక్రాచార్యుడు ఇచ్చిన శాపం వల్ల ముసలితనం వచ్చింది. కాని భోగలాలసత్వం ఇంకా ఎక్కువగా ఉండటంతో కుమారులలో ఎవరైనా తన ముసలితనాన్ని తీసుకొని, యవ్వనాన్ని ప్రసాదించమని అడుగుతాడు. పూరుడు ఒక్కడే అందుకు అంగీకరిస్తాడు. మిగతా ముగ్గురు కుమారులు అందుకు నిరాకరించగా, రాజ్యార్హతను కోల్పోతారు. యయాతి పూరుడి యౌవనాన్ని స్వీకరించి, మరికొంత కాలం సుఖములను అనుభవించి, పూరుడిని రాజ్యాభిషిక్తున్ని చేశాడు. అతని కుమారుడు ప్రచిన్వాట్; అతని కుమారుడు ప్రవరా; అతని కుమారుడు మనస్యు.
మహాభారతం - ఆది పర్వంలో ఇతను గంగా మైదానంలో తన రాజ్యాన్ని వారసత్వంగా పొందాడని చెప్పబడింది. ఇతని భార్య పౌష్టి ద్వారా ప్రవీర, ఈశ్వర, రౌద్రస్వ అనే ముగ్గురు శక్తివంతమైన వీర కుమారులు కలిగారు. పూరుడి తరువాత ప్రవీర, తరువాత అతని కుమారుడు మనస్యు వచ్చాడు. పూరుడు ప్రపంచ చక్రవర్తిగా పరిపాలించాడు. ఇది ఇతని శక్తిని, వ్యక్తుల హక్కును తెలియజేస్తుంది. తరువాతికాలంలో ఇతని రాజవంశం పురుష వంశంగా మారింది, తరువాత దీనిని పాండవులు, కౌరవుల కురు వంశంగా మార్చారు'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగం కావడంతో శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికై వెనుతిరిగాడు.


కామెంట్‌లు