(1)
ఆశ , ధ్యాస ఉన్నా
ఆశయం సిద్దించలే !
సక్రమమైతేగా...
అది అక్రమం !!
******
(2)
పరమాత్ముడో..
మహాత్ముడో,కాలేడు,
మనిషిగానైనా లేడు
ఈ వానరుడు !
*******
(3)
గంపెడు దుఃఖాలు
గుప్పెడు సుఖాలు
ఐనా బ్రతకాలి
చావా పరిష్కారం !?
******
(4)
ఆస్తి వారసులా.. !?
ఆశయవారసుడుకావాలి
ఆత్మను
తరింపజేస్తాడు !
******
(5)
మనిషి జీవితానికి ....
ఇన్నిన్ని తిప్పలా !?
అవన్నీ....
మనం చేసిన తప్పులే!
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి