ఘనంగా హోలీ రంగేళి ; - జరుగుమల్లి వీరయ్యకలికిరి చిత్తూర్ జిల్లా

 చిత్తూరు జిల్లా పీలేరు పట్టణంలో నారాయణ పాఠశాల నందు శుక్రవారం నాడు ఆర్ఐ కమలాకర్, ప్రిన్సిపాల్ హరిబాబు, ఏవో శివ శంకర్ ఆధ్వర్యంలో హోలీ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అర్ఐ కమలాకర్ మాట్లాడుతూ.. మానవ జీవితం సప్తవర్ణాల సమ్మేళనం, ప్రకృతిలో వచ్చే మార్పులకు కనుగుణంగా వచ్చే దానికి ప్రతిరూపం హోలీ వసంతోత్సవం అని అంటూ అర్ఐ కమలాకర్.. అందరికీ హోలీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రిన్సిపాల్ హరిబాబు మాట్లాడుతూ.. ఆనంద సరాగాల.. వసంత రాగాల కమ్మని కేళీ
రంగు రంగుల హోలీ పండుగ అని ప్రిన్సిపాల్ హరిబాబు తెలిపారు. అనంతరం ఏవో శివ శంకర్ మాట్లాడుతూ..
జాతీయ సమైక్యతను చాటే ప్రయత్నంగా సరికొత్త రంగులతో వసంత ఋతువు ఆగమనానికి ప్రతిరూపంగా జరుపుకునే పండుగ హోలీ పండుగ  అని ఏవో శివశంకర్  తెలిపారు. అంబరాన్నంటే హోలీ పండుగ సంబరాల కార్యక్రమంలో నారాయణ స్కూల్ ఆర్ఐ కమలాకర్, పీలేరు నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ హరిబాబు, ఏవో శివ శంకర్, వైస్ ప్రిన్సిపాల్ నిర్మల, ప్రీ ప్రైమరీ ప్రోగ్రామ్ ఇన్ ఛార్జ్ రేవతి, టీచర్ శ్రీలేఖ, విద్యార్థిని విద్యార్థులు అందరూ పాల్గొని అంబరాన్నంటిన హోలీ పండుగ సంబరాలు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కామెంట్‌లు