సునంద భాషితం;-వురిమళ్ల సునంద ఖమ్మం
 ఇలా ఉంటేనే...
******
 మనసైన వారికి, మనసును సాంత్వన పరిచే వారికి దగ్గరలో ఉండాలి. వీలైనప్పుడల్లా మాట్లాడుతూ ఉండాలి.
అప్పుడే బరువులు బాధ్యతలు, ఆందోళనల నుండి ఉపశమనం కలుగుతుంది.
మనమంటే నచ్చని వారికి, చిన్న చూపు చూసేవారికి, నలుగురిలో అవమానించాలనే సంకుచిత మనస్కులకు సాధ్యమైనంత దూరంగా ఉంటేనే మంచిది.
 ఇలా  మనోల్లాసానికి దగ్గరగా, మనోవేదనకు దూరంగా ఉంటేనే  మనసుకు కొండంత ప్రశాంతత చేకూరుతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు