నా కుటుంబమే నా సంతోషం.;-మహేష్ ఊటుకూరి-కలం స్నేహం
సంసారం ఒక చదరంగం అంటారు పెద్దలు.
సంసారం ఆనంద తీరం అంటాడు
 మా మిత్రుడు రమేష్...

అనవసరాలకు దూరంగా వుంటు
అవసరాలకు అతి దగ్గరగా వుంటు
 చిరునవ్వులు చెదరని 
చింతలు దరిచేరనీయకుండా 
వున్నంతలో తృప్తి పడే 
మనస్థత్వం వుంటే చాలు
ఆనందం మనవెంటే
అనుబంధం మన ఇంటే అంటు 
చక్కని విశ్లేషణతో 
తన సంసారం శ్రీమతి  ఇద్దరు పిల్లలు 
వీరేకాదు తన రక్తసంబంధాన్ని కూడా
 సమన్వయంతో సమర్థతతో 
తనలో భాగంగా భావిస్తు
కుటుంబాన్ని కుంటుపడకుండా
కలతలు అలకలు కలహాలు 
కోపాలు వివాదాలు లేకుండా 
సమస్య ఎక్కడ వుంటే 
అక్కడ పరిష్కారం చూపే చొరవే 
ఈ రోజు ఏరోజైనా ఇంటా బయట
 సంతృప్తి కి కారణం... ఇదే జీవితం..

ఆనందం అంటే ఏమిటి?
 స్వార్థం  పెరిగి ఒకరిని బాధించి 
 మనం నవ్వడం
ఆ నవ్వును కుటుంబానికి పంచడమా?

 ఆనందమంటే తన కష్టంతో  సంపాదనతో
బ్రతకడం బ్రతికించడం నవ్వించడం నడకలు
నేర్పించడం విలువలు పెంచడం  నియమాలను
అనుసరించడం..

ఎక్కడా ఎవ్వరిని కలుషితం కానీయని నైజమే
ఆనందానికి చిరునామా...

 ఆలా సాగి సంసారంలో సంతృప్తి ని ఆస్వాదిస్తు
ఆరోగ్యకరమైన భావజాలాన్ని భావితరమైన
 నా పిల్లలలో పెంచడమే నా సంపాదన 
నా సంతోషం నా ఆయుష్షు...


కామెంట్‌లు