'శాంతి వనం";-నలిగల రాధికా రత్న
రేపటి వేకువకై
నేడు నిరీక్షణ రేయి 
గడపాల్సిందే 
జీవనహేల 
ముందుకు సాగాల్సిందే...!!

జీవన పోరాటంలో 
కుంగిపోక ,పారిపోక 
కడలి కెరటంలా పోరాడటమే 
పాత్రధారి పని 
ఏ రూపంలో 
ఏది సాక్షాత్కరించినా 
అది సూత్రధారి పని....!!

నడకలో సంస్కారం 
చేతల్లో విశ్వాసం
సంకల్పమే బలంగా 
ప్రపంచం ముంగిట

సంధ్యా  సింధూరంలో
మమైకమై 
విజయపతాకం ఎగుర వెయ్
సాటి ప్రాణి మనుగడ ఆలంబనకై
అందాకా మూతపడనివ్వకు 
నీ మనోనేత్రాన్ని ....!!

ఎందుకంటే మనం మానవులం 
మంచిచెడులు 
పరిశీలించే భావుకులం....!!

ఆనాడు 
మనసు మందారం వికసించి 
పలువురికి పంచుతుంది 
ఆనందం ,ఆహ్లాదం 
విశ్వం అవుతుంది శాంతివనం....!!


కామెంట్‌లు