నేటి బాలసాహిత్యం :- ' గేయం "చదవాలి బాలలూ..... !" కోరాడ నరసింహా రావు

 చదవాలి బాలలూ, గొప్పగా ఎదగాలి మీరు ! చక్కగా చద వాలి బాలలూ, గొప్పగా ఎద గాలి మీరు !!
    విద్యా, వినయం పెంచుకుని 
విజ్ఞానం సముపార్జించుకుని... 
ఈ ప్రపంచంలొ అత్యుత్తమ పౌరులు కావాలి, మీరు జాతికె ఖ్యాతిని తేవాలి ! మన జాతికె ఖ్యాతిని తేవాలి !! భరతజాతికే
ఖ్యాతినితేవాలి !!!
     చదవాలి బాలలు గొప్పగా ఎదగాలి మీరు !
     జాతిపిత మానగాంధీ తాతలో సహనమ్ము,. నెహ్రూ
పటేలుల ధైర్యము,స్తైర్యము 2
భగత్సింగ్, అల్లూరి సౌర్య ప్రతాపములు, ఛత్రపతి శివాజీ 
ఝాన్సీ లక్ష్మీ బాయిల జీవితాలను .... 
చదవాలి బాలలూ... గొప్పగా ఎదగాలి మీరు !
మన భారతమాతకు ఆశా జ్యోతులు, కొడిగట్టక జ్వలియించాలి ! మీరు కొడిగట్టక జ్వలియించాలి !!
మీ నవ్య దీపాల దివ్య కాంతులతొ ప్రపంచమే ప్రజ్వలించాలి, ఈ ప్రపంచమే ప్రజ్వలించాలి !
  చదవాలి బాలలూ... గొప్పగా ఎదగాలి మీరు ! గొప్పగా ఎదగాలి మీరు !!  గొప్పగా ఎదగాలి మీరు... !!!
    *******
కామెంట్‌లు