అమరజీవి;-అయ్యలసోమయాజుల ప్రసాద్
 మాహాత్ముని ఆశయాలైన
సత్యం, అహింసలే సాధనాలుగా ,
హరిజనోద్ధరణయే ధ్యేయంగా, ఇరువది ఐదేండ్ల కే ధర్మపత్ని ధరణి వీడగా
సబర్మతీ ఆశ్రమానికేగి
జాతిపిత శిష్యుడవైన
ఆంధ్రజాతి రత్నమా
నీ కివే మా వందనములు..!!
స్వాతంత్ర్యసముపార్జనకు
ప్రధానమైన దండి, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని,ప్రేమ, నిస్వార్థసేవకు ప్రతిరూపమే శ్రీరాములని మాహాత్ముని మన్ననలు పొంది,దరిద్రనారాయణ సేవయే జీవిత లక్ష్యంఅన్న
హరిజనోద్దారకా
నీ కివే మా వందనములు..!!
ఆంధ్రరాష్ట్ర సాధనకై
ఆమరణ నిరాహారదీక్ష చేసి
ఆశయసాధనలో  అమరత్వం నొంది,
భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆధ్యుడవైన
అమరజీవి 
నీకివే మా వందనములు..!!
...............................కవిమిత్ర, సాహిత్యరత్న
అయ్యలసోమయాజుల ప్రసాద్
రసాయనశాస్త్ర విశ్రాంత శాఖాధిపతి
విశాఖపట్నం
చరవాణి:-9963265762
..............................
: పొట్టి శ్రీరాములు గారి జయంతి
16 మార్చి
కామెంట్‌లు