నుదుటి రాత!అచ్యుతుని రాజ్యశ్రీ

 శివా ది పెద్ద బీదకుటుంబం!కానీ మహా దైవభక్తి గలవాడు. "ఓభగవాన్!ఇంట్లో తిండి బట్టకి లోటులేకుండా చూడు.నాకే కోరిక లేదు. నన్ను హింసించు.కానీ నాపిల్లల్ని ఏడిపించకు."ఓరోజు  నిరాశతో కుంగిపోయి ఆత్మ హత్య చేసుకునే ఆలోచన లో ఉండగా అతని స్నేహితుడు  నారాయణ కలిశాడు."పిచ్చి శివా!బాల్యంలో అమ్మా నాన్న లు పోయి అనాధగా మీఇంట పెరిగాను.చిన్న ఉద్యోగం లో కుదురున్నాను.ఈడబ్బు తీసుకుని వెళ్లి పిల్లల కడుపు నింపు.ఇది అప్పుగా భావించకు.నాతో పట్నం రా"అని ఆసాయంత్రం తనతో తీసుకుని వెళ్లి  ఓవ్యాపారిదగ్గర  కొలువు ఇప్పించాడు.నీతినిజా యితీ తో పనిచేస్తూ తనకొచ్చే జీతంలో కొంతదాస్తూ ఏడాది తిరిగేసరికి  తనకుటుంబాన్ని చూడటంకోసం  డబ్బు మూటతో బైలుదేరాడు. అడవిగుండా వెళ్తూ  సాయంత్రం అలిసిపోయి చెట్టుకింద నడ్డివాల్చాడు.గాఢనిద్ర లోకి ఒరిగాడు.అతనికోకల వచ్చింది.రెండు ఆత్మలు మాట్లాడుకుంటున్నాయి.ఒకటిఅడుగుతోంది"ఇతని దగ్గర చిల్లిగవ్వ ఉండేది కాదు. ఇప్పుడు ఇంతధనం ఎలావచ్చింది?"రెండోదిఅంది"నీతినిజాయితీ తో కష్టపడి పని చేస్తాడు. వచ్చిన  జీతంలో కొంత ఖర్చు పెట్టి మిగతాది  కుటుంబం కోసం దాస్తాడు."'కానీ  ఈమూటధనం ఇతనిదగ్గర ఉండదు."మొదటిదాని మాటలు విని నవ్వు కుంటూ అవిమాయం ఐనాయి.అంతే శివా కి మెలుకువ వచ్చే ప్పటికి తెల్లగా తెల్లారి పోయింది.  తలకింద ఉన్న మూటమాయంఐంది.ఏడాది కష్టార్జితం  హుష్కాకి ఐంది. ఏడుస్తూ మళ్ళీ వ్యాపారి దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పి ఏడాది అంతా గాడిద చాకిరీ చేశాడు. మళ్ళీ డబ్బు మూటతో ఆదారంబడేవెళ్లి ఆచెట్టు కింద పడుకుని నిద్ర లోకి జారాడు.అదేమరి విధిలీల.మళ్ళీ కలలో ఆరెండు ప్రాణుల మాటలు వినపడ్డాయి.'"హు! ఇతని నుదుటడబ్బు గీత లేదు. "అనేసి వెళ్లి పోయాయి.మెలుకువ వచ్చి న శివా "దేవుడా!నాకష్టం అంతా  బూడిద లో పోసిన పన్నీరు ఐంది. ఉరేసుకునిచస్తా" అనుకుంటూ  తలపాగా మొలకిచుట్టి ధోవతిని కొమ్మకు వేలాడదీశాడు.ఇంతలో అశరీరవాణి వినపడినది. "మూర్ఖుడా!డబ్బే సర్వస్వం కాదు. ముందు ఇంటికెళ్లు." ఆత్మహత్య ప్రయత్నం మాని ఇల్లు చేరాడు.ఆశ్చర్యం!ఇల్లు అంతా ధనధాన్యాలతో నిండిఉంది.భార్య పిల్లలు ఖుషీ గా ఉన్నారు. "ఏమండీ!ఓసాధువుబాబా మాకు రెండు ధనపుమూటలు ఇచ్చి వెళ్లాడు"అని భార్య చెప్పగానే అతనికి  అర్థం ఐంది. ఇన్నాళ్లు  తను డబ్బు సంపాదన  యావలో పడి దైవప్రార్థన చేయటం మానేశాడు.ఇలా దైవం తనకు  గుర్తు చేశాడు అన్న మాట!ఇకనుంచి  ఏపని చేస్తున్నా సరే అది దేవుని కే చేస్తూ ఉన్నా అనే భావం తో ఉంటే చాలు "అని తృప్తి గా నిట్టూర్పు విడిచాడు. గంటలు గంటలు పూజలతో పని లేదు. ప్ర తి పని దేవుని వల్లనే చేస్తున్నాను"అనే భావం తో మంచి పనులు చేయాలి సుమా🌹
కామెంట్‌లు