ముక్తపదగ్రస్త వెన్నెలమ్మ పదాలు; ---గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
కవన వనమున కలము
కలము కవులకు బలము
బలము ఉంటే ఫలము
ఓ వెన్నెలమ్మ !

తెగువ ఉన్నది తెలుగు
తెలుగు బ్రతుకున వెలుగు
వెలుగు దారిని మెలుగు
ఓ వెన్నెలమ్మ !

వైతాళికులు కవులు
కవులు మహిలో ఘనులు
ఘనులు పనులే సిరులు
ఓ వెన్నెలమ్మ !

భువిని దేవత మగువ
మగువకున్నది తెగువ
తెగువ పనులే  విలువ
ఓ వెన్నెలమ్మ !


కామెంట్‌లు