* తరలి పో...... ! * కోరాడ నరసింహా రావు

 సృష్ఠి సమస్తం పాంచ భౌతికం 
ఆకాశము, వాయువు, అగ్ని, 
జలము, పృధివి.... !
విడి - విడిగా వేటి ప్రత్యేకతలు వాటికి ఉన్నా...ప్రతిదానిలోనూ ఈ ఐదు శక్తులూ అంతర్లీన మైనవే !
ఈపంచభూతములసమన్వయ, సమగ్ర స్వరూపమే ఈ ప్రపంచం !
ఇవి  శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములగుణములతో....  అలరారుచున్నవి !
ఈ పంచ భూతముల సర్వ శక్తులూ కలబోసిన విశిష్ట స్వరూపమే... ప్రాణికోటి సర్వములో శ్రేష్ఠతముడైన ఈ మానవుడు !
సమస్త సృష్టికీ కేంద్ర బిందువు మనిషే !
ఈ మనిషిని  మినహాయిస్తే... 
ఈ సృష్ఠి సమస్తానికీ అర్ధ, పరమార్ధాలు సూన్యమే !
 ఈ సృష్టిలో యే శక్తి ఐనా ఉంది అంటే... అది ఖచ్చితంగా ఈ మనిషిలో ఉండే తీరుతుంది 
మనిషిలో  ఇది లేదు అంటే... 
సృష్ఠి సమస్తంలో ఎక్కడ వెదికినా అది ఉండదు !ఇది సత్యం !!
ఇంతటి ఉత్కృష్టమైన మహో న్నత మానవ జన్మనెత్తీ... 
మనిషిలా కాక, ఏ మృగం గానో 
మరెలానో బ్రతకటం దౌర్భాగ్య మే కదూ...!
అదృష్టం అందలమెక్కిస్తే... 
బుద్ది బురదలోకి లాగటమంటే ఇదే !
సృష్టికి, ప్రతిసృష్టి చేస్తున్న మహోన్నతుడైన మనిషిని మాయ ఆవహించి... పెడ త్రోవ 
పట్టిస్తోంది !
ఈ మనిషికి, తను మనిషినన్న విషయాన్ని మరిపించి, పశువు ను  చేసి, రాక్షసునిగా మార్చేస్తోంది !
అక్రమాలు, అన్యాయాలు చే యిస్తోంది ! అరాచకాలు సృష్టిస్తోంది !
అశాంతి, అలజడులను రేపుతోంది !
ఈ మానవ జన్మ పరమార్ధాన్ని మరిపించి కర్మ,జన్మలవలయం 
లో తప్పించుకొననీయక తిప్పు తూనే ఉంది !
ప్రేమ, దయ, జాలి, కరుణ,సేవ 
త్యాగాలైన మనిషి సహజ గుణాలను దూరం చేసి... 
మోక్షయోగి కావలసినమనిషిని 
సతీ, సుత, ధన,కనక  వస్తు, వాహనాది భోగులను చేసి ఆశ, నిరాశలఎండమావులమెరుపుల వెంట మై మరపించి సుఖ, దుఃఖానుభవాలతో అలసట, ఆయాసాలను మిగిలిస్తోంది !
    ఓ మనిషీ !
ఇకనైనా మేలుకో !!
మనిషిగా పుట్టిన నీవు... మనిషిగా బ్రతుకుతూ... మహాత్మునిగా ఎదిగి... పరమాత్మునివై తరలిపో... !
     ******
కామెంట్‌లు