సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 అసూయ... అనుమానం...
******
అసూయ, అనుమానం ఇవి రెండూ ,మనసుకూ మనిషికి హాని కలిగించే అంతర్గత శత్రువులు.
వీటిని మొదట్లోనే తుంచేయకపోతే వ్యక్తి గతంగా అధఃపాతాళానికి జారిపోయేలా చేస్తాయి.
ఎదుటి వారి  ఏ రకమైన ఎదుగుదలనైనా  చూసి ఆనందించాలి. అది సక్రమమైన మార్గం అయితే  ఆ దిశగా  ప్రయత్నం చేయాలి.
అసూయతో రగిలిపోతే  ఆ  జ్వాలే మనసుకు శరీరానికి కీడు కలిగిస్తుంది.
అనుమానం పెనుభూతం అంటారు.అది మనసులో ప్రవేశించిందంటే తన నీడను సైతం నమ్మనీయదు.పచ్చని జీవితాన్ని ధ్వంసం చేసేదాకా ఊరుకోదు.
అందుకే అనుమానాన్ని ఆమడ దూరంలో ఉంచాలి.అసూయను దరిదాపుల్లోకీ రానీయకూడదు.
ఇవి రెండూ లేని వారు స్నేహ పూర్వక బంధాలను ,అనుబంధాలను కలిగి ,నిత్య జీవితంలో ఎంతో సంతోషం,సంతృప్తితో జీవిస్తారు.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏కామెంట్‌లు