వానకు జై (బాలగేయం);-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్

 మబ్బులు మబ్బులు మబ్బులొచ్చినయ్ 
మబ్బుల మధ్యా మెరుపులొచ్చినయ్ 
మెరుపులతోనీ చినుకులొచ్చినయ్ 
హోరుగ వానలు కురువసాగినయ్ 
జోరుగ కాల్వల పారసాగినయ్ 
పంటలు మెండుగ పండసాగినయ్
 కరువులు పూర్తిగ వెళ్ళిపోయినయ్
 ప్రజలకు సుఖములు కలుగజేసినయ్ 
అందుకే వానకు జై జై జై జై !!

కామెంట్‌లు