అగ్రగణ్యుడురా మన ఆర్యభట్టు;---పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
పాటలీపుత్ర రత్నం
కుసుమపురంలో ‌వికసించిన 
వాడని కుసుమంరా మన ఆర్యభట్టు
విప్పిచెప్పెను గదరా ఏనాడో ‌విశ్వంగుట్టు

పరబ్రహ్మ స్వరూపాన్ని 
వివరించే 13 శ్లోకాల దశగీతికతో
ఆర్య సూర్య సిద్ధాంతాల వివరణతో
108 శ్లోకాల ఆర్యాష్టోత్తరశతకంతో
మహా పండితుడు మన ఆర్యభట్టు
వ్రాసిన రెండు భాగాల ఆర్యభట్టీయం
అద్భుతమైన అద్వితీయమైన అపూర్వమైన
మన భారతీయ పురాతన సంస్కృత గ్రంధం

భూమి‌ తనచుట్టూ తాను తిరగడానికి
23 గంటల 56‌ నిముషాల 4.1సెకన్లనిచెప్పి
"పై" విలువ 3.1416 అని కనిపెట్టి 
ఆధునికశాస్త్రజ్ఞులనే ఆశ్చర్యంలో ముంచెత్తిన
గణిత ఖగోళ శాస్త్రాలలో ఆర్య సూర్య
సిద్ధాంతాల్లో అగ్రగణ్యుడురా మన ఆర్యభట్టు
విప్పిచెప్పెను గదరా ఏనాడో ‌విశ్వం గుట్టు

అరబ్బు గ్రీకు శాస్త్రవేత్తలకు
ఆర్యభట్టు సిధ్ధంతాలే ఆధారమని...
చంద్రుడు స్వయంప్రకాశకం కాదని...
అది సూర్యకాంతి పరావర్తనం వల్లనేనని...
భూగోళః సర్వతోవృత్తః...అని...
ఉదయాస్తమయాలు భూభ్రమణం వల్లనేనని...
భూమినీడ చంద్రునిపై పడడంవల్లే 
సూర్యచంద్ర గ్రహణాలని...
రాహుకేతువులు లేవని...

విజ్ఞాన శాస్త్రజ్ఞులే విస్తుపోయేలా 
విప్పిచెప్పెరా ఏనాడో ‌విశ్వంగుట్టు
ప్రపంచ శాస్త్రవేత్తల 
ప్రశంసలు పొంది మన ఆర్యభట్టు 

ఆర్యభట్టు పేరును 
తొలి కృత్రిమ ఉపగ్రహానికి పెట్టి ఘనమైన 
నివాళినర్పించెరా మన భారతప్రభుత్వం
భారతమాతకు బంగారు ఆభరణమైన
ఆధునిక శాస్త్రవేత్తలకు ఆశాకిరణమైన
ఖండాంతర కిర్తిని ఆర్జించిన  ఆర్యభట్టుకిదే నాఅక్షరనివాళి


కామెంట్‌లు