దారి!? ప్రతాప్ కౌటిళ్యా
నిప్పులపై నడుస్తున్నట్లు
గండ్ర గొడ్డలితో తల నరుకుతున్నట్లు
అడ్డ నామాలు నిలువు నామాలు
ఉలిక్కి పడి మేల్కోన్నట్లు!!

ఆకాశం అంతా ఎర్రబడి నాలుక తెగిపడినట్లు
రాళ్లు తిరగబడి కలబడుతున్నట్లు
భూత ప్రేత పిశాచాలు వేదమంత్రాల కు
పరుగిడి పారిపోతున్న ట్లు
ఓంకారనాదంతో తలలు చిట్లీపోతున్నట్లు

ఎవరో ప్రవచనాలు వల్లిస్తున్నారు
దృశ్యాల్ని ప్రదర్శిస్తున్నారు
మెలుకువ లో నిదురలో
పదే పదే గుర్తు చేస్తున్నారు!!!?

ఎవరో దారికి అడ్డంగా
మాటల గోడలు కడుతున్నారు
చిత్రాల మంత్రాల దారిలో
యజ్ఞాలు చేస్తున్నారు!!?

ఎక్కడి దారులక్కడ మూతబడ్డాయి
చౌరస్తాలన్నీ ఊరి పొలిమేరలో
ఊపిరి పీల్చుకుంటూన్నావీ
ఎగిరే పక్షులు దారుల్ని చుట్టుముట్టాయి !!?

మేఘాల ఆవల రాబందులను రక్షించేందుకు
గద్దలు గాల్లో యుద్ధం చేస్తున్నాయి !! మంటలు ఆరితే దారులు ఏర్పడి
మనుషులు ఎప్పటిలా
నీటిలో మునిగి తేలాలని
వర్షం ప్రారంభించాలని ఆకాశవాణి ప్రకటించింది!!?

కాళ్లు చేతులు ఆడక అడవులు ఎడారి ముఖం పట్టాయి!
మౌనంగా మునుల్లా తపస్సు కొనసాగిస్తున్న దీపాలు అఖండజ్యోతులై
చీకటి రాత్రుల్నీ చీల్చి చెండాడుతున్నావీ

ఎవరు వస్తారో ఎవరు వెళ్తారో
నిషేదాజ్ఞలు జారీచేసిన స్వర్గ నరకాలు
పూర్తిగా మూతపడ్డాయి!!?

పాప పుణ్యాలు మంచిచెడులు మర్చిపోయి
శరీరాన్ని వదిలి మనుషులు ఆత్మ లై
గాలిలో ఎక్కడికో ఎగిరిపోతున్నారు !!?

ఒక్కసారి మాటల్ని ఆపేయండి
దృశ్యాల్ని చెరసాలలో బంధించండి
ఎగిరే పావురాల్నీ అనుసరించండి
దారి దొరుకుతుంది !!?

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏❤️🙏
8309529273
SRI SRI KALAVEDIKA President

కామెంట్‌లు