శబరి . పురాణ బేతాళకథ.;- డాక్టర్ ; బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 పట్టువదలని విక్రమార్కుడు మరలా శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుని భంధించి భుజంపైన చెర్చుకుని మౌనంగా నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు 'మహారాజా నీపట్టుదల మెచ్చదగినదే నాకు భక్త శబరి గురించి తెలియజెయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు' అన్నాడు.
' బేతాళా శబరి గతజన్మలో"మాలిని"అనేపేరున "చిత్రవకుడు" అనే గంధర్వరాజుకుమార్తేగాజన్మించి "వితిహోత్రుడు"అనే అతన్నివివాహం చేసుకుంది,తనభర్త నిత్యం హోమాలుచేస్తూ ఉండటంతో"కల్మషుడు" అనేబోయవానితో స్నేహంగాఉండసాగింది.అదితెలిసినఆమెభర్తకోపించి శబరిగాజన్మించమనిశపించాడు, తనతప్పుమన్నించి శాపవిమోచన  వేడుకోగా శ్రీరామునిదర్శనానంతరం తిరిగినన్నుచేరుకుంటావని అన్నాడు.శాపకారణంగామాలిని శబరికన్యగా జన్మించి ఆజన్మ బ్రహ్మచారిణిగాఉండి పంపానదితీరానఉన్న మాతంగమహర్షి ఆశ్రమంలో ఆయనశిష్యురాలిగాఉంటూ శ్రీరాముని దర్శనానికి ఎదురుచూస్తూ తపస్సుచేయసాగింది."దనువు"అనేగంధర్వుడుశాపవశానకబందుడుగా మారిఅడవిలోని ప్రాణులను ఆహరంగా స్వీకరిస్తూ అక్కడకువచ్చిన రామలక్ష్శణులనుతనహస్తలతోబంధించగాకబంధునికిమోక్షంప్రసాదించిన రామలక్ష్శణులు కబందునిసూచనమేరకు వెదుకుతూమాతంగమహర్ష ఆశ్రమంలోనికివెళ్ళారు,మంగళకరమూర్తి శ్రీరామునికన్నులారా కాంచినశబరి"ధశరధనందనా రావయ్య ఎంతో కాలంగా నీదర్శనభాగ్యానికి ఎదురుచూస్తూన్నా నేటికి నాతపస్సు ఫలించింది, స్వామి ఆజలపాతంలో స్నానమాచరించు అరమగ్గిన ఈమధురఫలాలు నీకోసంసేకరించిదాచాను ఎమిటిసందేహిస్తున్నావు ఇవన్నినేనుగోటితోగిల్లిరుచిచూసాను అన్నిఫలాలు మధురాతి మధురాలే"అంటూ శ్రీరామునిపాదపూజచేసిన శబరి" రామచంద్రా ఆపదకాలంలోనేధైర్యంగాఉండాలి సీతామాతను ఎడబాసిననీవు ఇక్కడకు సమీపంలోని "ఋష్యమూకపర్వతం" మీదసుగ్రీవుడు అనేవానరవీరుడు తనఅన్నచే అవమానింపబడి తనబలగంతో ఉన్నాడు అతనితో అగ్నిసాక్షిగా స్నేహం ఏర్పరుచుకో అతను సీతాన్వేషణలో అతను మీకుఎంతోసహకరిస్తాడు,సుగ్రీవుని సైన్యంలోశతవలి-సుషేణుడు-తారుడు-కేసరి-గవాక్షుడు-ధూమ్రుడు-పనసుడు-గయుడు-మైంద ద్వివిదులు-గజుడు-జాంబవంతుడు-రుమణ్వంతుడు-గంధమాధనుడు-అంగదుడు-ఇంద్రజానుడు-రంభుడు-దుర్ముఖుడు-హనుమంతుడు-దధిముఖుడు-శరభుడు-కుముదుడు-వహ్ని-రంహుడు వంటి వానర వీరులు కోట్లసంఖ్యలోఉన్నారటమా
గురువు మాతంగమహర్షి చెప్పారు, నీకుఅంతాశుభమేజరుగుతుంది  నీపాదాలుతాకేభాగ్యంతో నాజన్మతరించింది ఇహశెలవు "అంటూ రామునిపాదాలకు నమస్కరిస్తూ తనతపోశక్తిచే భస్మరాసిగా మారిపోయింది ' అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగం కావడంతో  శంవంతో సహామాయమైన బేతాళుడు తిరిగి చెట్టుపైకి చెరాడు.
పట్టువదలని విక్రమార్కుడు తిరిగి బేతాళునికై వెనుతిరిగాడు.

కామెంట్‌లు