చక్కని పెంపకం;-జె వి కుమార్ చేపూరి ;-కలం స్నేహం
సంఘాన అన్ని అనర్ధాలకు మూలం  
పిల్లల సంస్కార రహిత  పెంపకం  
పసితనానే నూరిపోస్తే సభ్యత సంస్కారం 
ఆ సంతానమే నిర్మించు సమ సమాజం

నమ్మింది ఆ ఇల్లాలు కమల ఈ సూత్రం 
ఇద్దరు ముద్దుల తనయలతో సాగిస్తోంది జీవితం
అందం, చురుకుదనం ఆ సోదరి ద్వయ సొంతం      
ఒకరు లక్ష్మి అవతారం, మరొకరు సరస్వతి ప్రతిరూపం

లేకపోయినా ఇంట తండ్రి సాంగత్యం అనుక్షణం
వెంటాడుతున్నా అడుగడుగున పేదరికం
అన్నీ తానై పిల్లలకు బోధిస్తుంది జీవిత పాఠం
కమలకు తన పిల్లల తోడిదే లోకం నిత్యం  

వున్నది ఈ ఇల్లాలి పెంపకంలో గారాబం
కాదది ఎన్నడు హద్దులు దాటే అతిగారాబం
పెంచుతోంది నీతి కధలు చెబుతూ నిరంతరం
తన తనయలతో తాను అయి మమేకం 
ఆడుతుంది వారితో తాను అయి ఏకం

కోరి చేసుకున్న అయిన సంబంధం 
వారి అన్యోన్యతకు వేసింది పెద్ద పీఠం 
తల్లితండ్రి అన్నీ తానైన ఆ తల్లి పెంపకం
అన్నీ వున్నా, తృప్తిలేని తల్లులకొక పాఠం

సంఘానికి అవసరం కమలలాంటి పెంపకం 
సభ్యత సంస్కారాలతో  పెరిగితే సంతానం 
నరేంద్రుడు కోరిన యువత దేశానికి లభ్యం 
అప్పుడే గృహం దేశం రెండూ సదా సుభిక్షం

 


కామెంట్‌లు