వ్యూహం!!? ప్రతాప్ కౌటిళ్యా
అందమా
నిన్ను నీవు ప్రదర్శించు కో
అద్దం చూడడం కోసం !!?

చిరునవ్వా
వెలుగా చీకటాఅనీ చూడకు
కటిక చీకట్లో కూడా కనిపించు !!?

ప్రేమా
వరుస కలుపకు
అర్హతల కోసం వెతుకకూ
గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది!!?

కృష్ణా రామా అనకు
కంటి చూపు పోయింది అనుకుంటారు!!?

వయసు మనసు పెళ్లి చేసుకుంటే
పిల్లలు పుట్టరు
పెళ్లి కూతుర్లు పుడతారు!!?

దేవతలు రాక్షసులు ఉండరు
ఆడ మగ వాళ్ళు మాత్రమే ఉంటారు!!?

నీతి నిజాయితీ
జన్యువు లో జన్మలో జాతిలో ఉండదు
ఆశలోఆసక్తి లో ఉంటుంది !!?

గొప్పతనం ఉప్పు కారం లా ఉండదు
మమకారం కనికరం లా ఉంటుంది!!?

ప్రేమించడం చేతకాకపోతే
ప్రేమను అనుభవించడం నేర్చుకోండి!!?

శరీరమంటే గౌరవం లేని వాడు
శరీరం ఒక వరం అంటే నమ్మడు!!?

విజేత లతోనే ప్రపంచం గెలిస్తే
ప్రపంచమంతా అజ్ఞాతం లోనే ఉన్నట్లు!!?

నీకు కావలసింది దొరికిన దొరకకున్నా
సంతోషం దుఃఖం తో పాటు
మరణం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది!!

బహిరంగ వ్యూహంలో నుంచి
బయట పడాల వద్ద అన్నది బుద్ధి కాదు
వయసు నిర్ణయిస్తుంది!!?

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏❤️🙏
8309529273

కామెంట్‌లు