బాణాసురుడు. పురాణ బేతాళ కథ .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 పట్టువదలని విక్రమార్కుడు శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుని బంధించి భుజంపై చేర్చుకుని మౌనంగా బయలుదేరాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు మహారాజా ' నీపట్టుదల అభినందనీయం.నాకు బాణాసురుని గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు 'అన్నాడు.
'బేతాళాబలి చక్రవర్తికుమారుడు.ఇతనుఅకుంఠితదీక్షతో పరమ శివుని ధ్యానించి ఆయన్ని మెప్పించి తనకు రక్షణగా శోణపురానికి తెచ్చుకొన్నాడు. ఈ అసురుని చూస్తే సమస్త భూలోకం, స్వర్గలోకం కూడా గజగజ వణికి పోతూ ఉండేది. ఒకసారి వీడికి రణకండుతి చాలా ఎక్కువై శివునితో మహాదేవా నువ్వుతప్ప నాతో యుద్ధం చేసేవారేలేరా అని అనగా శివుడు వీని రణకండూతికి, మూర్ఖత్వానికి చింతించి నీ రథం మీద ఉన్న జండా క్రిందకు పడినప్పుడు నిన్ను జయించేవాడు వస్తాడు అని చెప్తాడు.
 తేజ్ పూర్ ని బాణాసురుడు రాజధానిగా చేసుకొని పరిపాలన చేసేవాడు. ఇదివరకు దీనిని శోణాపుర్ అని పిలిచేవారు.
బ్రహ్మ కుమారుడు మరీచి,మరీచునికుమారుడు కశ్యపుడుకశ్యపుని కుమారుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు
హిరణ్యకశ్యపుని కనిష్ఠ పుత్రుడు ప్రహ్లాదుడు,ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు,విరోచుని కుమారుడు బలి చక్రవర్తి
ఆ బలి కొడుకే ఈ బాణాసురుడు,ఆ బాణాసురుని భార్య కండల.
బాణాసురిని కూతురైన ఉష దేవి యుక్త వయస్సు వచ్చినప్పుడు చాలా మంది రాకుమారులు వివాహం చేసుకోవడానికి ముందుకు రాగా బాణాసురుడు అందరిని నిరాకరిస్తాడు. ఉషా దేవికి చిత్రలేఖ అనే చెలికత్తె ఉండేది. ఈమెకు చిత్రలేఖనంలో అసమాన్య ప్రావీణ్యం ఉండేది. ఒకరోజు ఉషా దేవి స్వప్నంలో ఒక రాకుమారుడు కనిపించి ఆమెను ఆలింగనం చేసుకొంటాడు. ఆ విషయాన్ని చిత్రలేఖకు చెప్పగా చిత్రలేఖ తన చిత్రకళా చాతుర్యంతో సమస్త భూగోళంలో ఉండే రాకుమారుల చిత్తరువులు గీసి చూపుతుంది. అందులోని ఒక చిత్తరువు చూసి ఎవరే ఈ నవమోహన మోహనాంగుడు అని ఉషా దేవి అడుగగా చిత్ర లేఖ రాకుమారిడి చిత్తరువు చూసి ఈ రాకుమారుడా ! ఇతను శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు అని చెప్పి చిత్రలేఖ తన మాయాశక్తితో అనిరుద్ధుని బృందావనం నుండి శోణపురానికి తెప్పించి ఉషా దేవి హంస తూలికా పాన్పు పై పడవేస్తుంది. ఆ రోజు నుండి ఉషానిరుద్ధులు ప్రణయ క్రీడలో మునిగితేలుతారు. ఒక రోజు ఉషాదేవి గర్భవతి అయిన విషయం ద్వారపాలకులకు తెలియడంతో వారు వెళ్ళి బాణాసురుడికి విన్నవిస్తారు. బాణాసురుడు అనిరుద్ధుడి మీదకు సైన్యాన్ని పంపుతాడు. అనిరుద్ధుడు అందరిని నాశనం చేయడంతో బాణాసురుడే యుద్ధానికి వెళ్ళి నాగపాశం విసురుతాడు. ఆ సమయంలో బాణాసురుడి రథం మీద జండా క్రింద పడుతుంది. ఇది చూసిన బాణుడు తనని జయించగలిగే వీరుడు వచ్చాడని ఆనందపడుతాడు. బృందావనంలో అనిరుద్ధుడు కనిపించక పోయేసరికి అందరు చింతిస్తూ ఉంటే జగన్నాటక సూత్రదారి శ్రీకృష్ణుడు నారదుడి ద్వారా ఈ విషయాన్ని గ్రహిస్తాడు 'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగం కావడంతో శవంతో సహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టుపైకి చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.


కామెంట్‌లు