ఎందుకు? (బాలగేయం);-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 పక్షులు అన్నీ ఎగురును ఎందుకు?
 పశువులు అన్నీ నడుచును ఎందుకు? 
వృక్షములన్నీ నిలుచును ఎందుకు ? 
నీరు అంతా పారును ఎందుకు? 
గాలి అంతా వీచును ఎందుకు ? 
ప్రకృతిలోన రంగులు ఎందుకు? 
రమ్యమైన శబ్దములెందుకు? 
ఎండలు వానలు చలిగాలీ 
కాలములన్నీ ఎందుకు? 
సూర్యుడు, చంద్రుడు,  
నక్షత్రాలు, మేఘాలు 
ఆకాశంలో ఎందుకు?

కామెంట్‌లు