ఛాయాదేవి.పురాణ బేతాళ కథ..; డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు
 పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించిఉన్న బేతాళుని బంధించి భుజంపై చేర్చుకుని మౌనంగా బయలు దేరాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు 'మహారాజా నీపట్టుదల అభినందనీయమే,నాకు సూర్యునిభార్య ఛాయాదేవి గురించి తెలియజేయి. నీకు తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు. అన్నాడు.
' బేతాళా  సూర్యుని భార్య, హిందూమతంలో నీడ దేవత. సూర్యుని మొదటి భార్య సరన్యు (సంజ్నా)కు నీడ (ప్రతిబింబం). ఛాయా సంజ్ఞ నీడ నుండి జన్మించంది. ఛాయను శని తల్లిగావర్ణించారు.ఈమెకుసావర్ణి మనువు అను కుమారుడు జన్మించాడు.
సూర్యుని మొదటి భార్య పేరు సంజ్ఞ. సంజ్ఞ సూర్యుని వలన మనువు, యముడు,యమునలను సంతానంగా పొందింది. కోమలాంగి అయిన సంజ్ఞ సూర్యు వేడిని సహించలేక తన యోగబలంతో తనవలే ఉండే తన నీడను ఛాయగా ప్రాణం పోసింది. సూర్యునితో ఉండమని ఛాయను ఆజ్ఞాపించిన సంజ్ఞ, ఉత్తర కుశంలో ఉండే ఏకాంత వాసానికి వెళ్ళిపోయింది. సూర్యుడు ఛాయను సంజ్ఞగానే భావించి, ఆమె వలన సంవీర్ణ, శని, తపతి అనే ముగ్గురు బిడ్డలను కన్నాడు. కాలం గడచిన కొద్దీ ఛాయ, సంజ్ఞ సంతానంమీద ధ్వేషం పెంచుకోగా మనువు సహించి ఊరుకోగా, యముడు మాత్రం కోపగించుకునేవాడు.
అతనికి తల్లిమీద కోపం వచ్చి ఆమెను కొట్టడానికి కాలు ఎత్తాడు. అందుకు ఛాయ కోపంతో యముని మందబుద్ధివిగా అని శపించింది. అసలు విషయం తెలుసుకున్న సూర్యుడు యమునికి, యమ ధర్మరాజ పదవినిచ్చాడు. తరువాత సూర్యుడు తన మామ త్వష్ట ప్రజాపతిని కలిసి జరిగినదంతా తెలియజేయగా అతడు అల్లుని శాంతింపజేసి తన కుమార్తె ఆడగుర్రము రూపములో ఉత్తర కురుదేశములో సంచరించుచున్నదని తెలిపాడు. సూర్యుడు అక్కడికి వెళ్ళి గుర్రము రూపంలో ఉన్న ఆమెకు తన నోటిద్వారా వీర్యమును ఆమె నాసికలందు స్కలించాడు. ఆ వీర్య ప్రభావముచే వారే అశ్వినీ దేవతలుగా పిలువబడుతున్నారు'  అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగంకావడంతో శవంతోసహా మాయమైన బేతాళుడు మరలా చెట్టుపైకి చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.

కామెంట్‌లు