బుల్లెట్స్;-:డా.రామక కృష్ణమూర్తిబోయినపల్లి,సికింద్రాబాద్.
ఓర్వలేనితనం
ఎంత పనిచేస్తుంది?
సమతామూర్తినే
వెక్కిరిస్తున్నది.

ఆధిపత్యధోరణి
ఎంతవరకు వెళ్తున్నది?
సామాన్యప్రజలను
బలితీసుకునే వరకు.

వాస్తవచిత్రణలు
ఏమి చేస్తాయి?
కళ్ళు తెరిపించి
కన్నీళ్ళు కార్పిస్తాయి.

ఊకదంపుడు ఉపన్యాసాలు
ఏమి చేయగలవు?
చెత్తను మొత్తంగా
ఊడ్చేయగలవు.

మేకపోతుగాంభీర్యాలు
ఎక్కడి వరకు?
ప్రజాతీర్పులు
పడుకోబెట్టేవరకు.


వాపులు,బలుపులు
ఎలా కనబడతాయి?
కొండతో ఢీకొట్టి
కొమ్ములూడిపోయినట్లు.

అసత్యాల,అబద్ధాల
పర్యవసానమేమిటి?
తనవారే పరులై
బలితీసుకొంటారు.
కామెంట్‌లు