తొందరపాటు!అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆవింత అడవిలో ఓపక్షి బంగారు రెట్ట వేసేది.ఒకడు ఆదారినవెళ్తూ ఈవార్తను ఊరంతా చాటాడు.దాన్ని విన్న ఓవేటగాడు పంజరంతో అడవికి వెళ్ళి అంతా వెతికాడు కానీ ఆపిట్ట జాడలేదు.కానీ చెట్టుకింద బంగారు రెట్ట కనపడటంతో ఆచెట్టుమీద నే అది ఉంటుంది అని ఊహించి అక్కడ వలవేసి దాన్ని పట్టి పంజరంలో పెట్టి ఇంటికి తెచ్చాడు. అదివేసిన రెట్టలతో వాడిఇల్లు బంగారం తో నిండిపోయింది. దానితో వాడి కి వేటకెళ్లే బాధ తప్పిపోయింది. కానీ వాడు నీతినిజాయితీ కలవాడు కావటంతో రాజు దగ్గరకు పిట్ట ఉన్న పంజరాన్ని తీసుకుని వెళ్లి "ప్రభూ! ఇదిబంగారురెట్ట వేస్తుంది. మీకు కానుకగా ఇద్దామని తెచ్చాను."అన్నాడు.రాజు కి తిక్కరేగింది."ఈనల్లపిట్ట బంగారు రెట్ట ఏంటీ? నీబుర్ర చెడిందా?"అని గద్దించాడు. "లేదు సామీ! నాను సెప్పేది నిజం!"వాడు దీనంగా అంటుండగానే పిట్ట బంగారు రెట్ట వేయటంతో నమ్మకం కలిగింది. కానీ మంత్రి పెద్ద గా నవ్వు తూ"ప్రభూ!నిజం గా అది బంగారం దైతే వాడు మీకెందుకు తెచ్చి ఇస్తాడు చెప్పండి? బంగారం ఎవరికి చేదు?"అని అనుమానం వెలిబుచ్చాడు."దీనివెనక ఏదైనా మోసం కుట్ర ఉందేమో?" రాజు  కించిత్ కూడా ఆలోచించకుండా  పంజరంలోంచి పిట్టను విడిచి పెట్టమని ఆజ్ఞాపించాడు. భటుడు దాన్ని విడిచి పెట్టగానే ఆపిట్ట  దర్బార్ లో కిటికీ పైనిలబడి ఇలాఅరిచింది."మీరంతా  మహా మూర్ఖులు!ఈవేటగాడు నన్ను కష్టపడి వెతికి పట్టుకుని రాజు కి అప్పజెప్పిన తొలి మూర్ఖుడు. సిరిరామోకాలొడ్డిన ఈరాజు బుర్రలేని మంత్రి సలహా తో నిజాయితీ గా కానుకగా ఇద్దామని వచ్చిన  వేటగాడి ని అనుమానించాడు.రాజు మహామూర్ఖుడు.శుద్ధ పరమమూర్ఖాగ్రేసరచక్రవర్తి మంత్రి! వేటగాడి నోటి కాడి కూడును పోగొట్టాడు."అని పిట్ట తుర్రుమని ఎగిరిపోయింది. 

మనం ఎవరేది చెప్పినావినాలి.కానీ తొందరపడి ఎవరోఒకరు చెప్పి న మాటలు నమ్మడం మూర్ఖత్వం. ఆలోచించి  పెద్దలసలహా తీసుకుని తర్క వితర్కాలతో ఆలోచించి మన నిర్ణయం తీసుకోవాలి🌷


కామెంట్‌లు