ఆల్బర్టు ఐన్స్టీన్ ; -ఎం. వి. ఉమాదేవి
ప్రక్రీయ: ఆట వెలది పద్యం 
: సాపేక్ష సిద్ధాంత కర్త 


ద్రవ్య శక్తి నుండి దార్శనికుడుగాను 
ఐను స్టీను ఘనుడు ఐనవిధము 
విశ్వ కీర్తి పొంది విశ్వనా శకుడైన 
వ్యథను  గల్గి మారె వ్యక్తిగాను !

విద్యుచ్ఛిత్ర ములును విమలయశముబొంది 
జగమునందు వెల్గె జాతి కీర్తి 
మార్గదర్శనమ్ము మరితాను గానిల్చె 
వాసియైన మేధ వందనాలు !!

కామెంట్‌లు