* శబ్ద శక్తి * కోరాడ నరసింహా రావు

    మంత్రశక్తి మహిమను ఎరిగిన వారే... ఆ మంత్రంలో దైవాన్ని దర్శించ గలవుతారు!
మంత్రం లో అంత మహత్తర శక్తి దాగిఉంది !
ఆ మంత్రశక్తి, శబ్దము లోనే నిక్షిప్తమై ఉంది !
శబ్దాన్ని ఉచ్చరించినంతనే... 
ఆ శక్తి విస్ఫోటనమై తరంగాలుగా ప్రవహిస్తూ ప్రభావాన్ని చూపిస్తుంది !
మంత్రశక్తి కి  మూలం శబ్దమే !అంటే... పదమే... ఆ పదాలకు ఆధారమైన అక్షరమే... !!
శబ్దశక్తి అంటే మంత్రశక్తికి మూల రూపమే !
పదము...అర్ధము...భావముల 
సమన్వయ సమగ్రశక్తి స్వరూప మే... కవిత్వం... సాహిత్యం !
సాహిత్యంలో...అందునా ప్రత్యే కించి కవిత్వంలో, శబ్దశక్తిని గుర్తించి, ఎక్కడ యే శబ్దాన్ని అంటే పదాన్ని ప్రయోగిస్తే..., 
భావానికి పూర్ణత్వం సిద్దిస్తుందో 
తెలిసి ప్రయోగిస్తే...ఈ సమాజ పు రుగ్మతలకు...  కీల్లెరిగిసరైన  వాతలు పెట్టగలిగినట్టే... !
    సాహిత్యంలో ప్రయోగించే పదాలు సాధారణంగా,అభిధా, లక్షణా, వ్యంజనా అనే మూడు రకాలశక్తులనుకలిగిఉంటాయి!
సాహిత్యంలో  ఎక్కడ,ఎప్పుడు యే సందర్భానికి ఏశబ్దశక్తి ప్రయోగము  అత్యంత ప్రభావ జనితమో... తెలిసి ప్రయోగిం చగలవారే గొప్ప కవులు, రచయితలుగా గుర్తింపు ను పొంద గలుగుతారు !
అబిధా శక్తి పదాన్ని ప్రయోగిం చాల్సినచోట యే లక్షణా, వ్యంజనా శక్తినో ప్రయోగిస్తే... 
భావార్ధ సౌందర్యం చెడుతుంది!
వ్యంజనా శక్తిని ప్రయోగించాల్సి నచోట అభిధా, లక్షణా శక్తుల ప్రయోగము నిశ్ఫలమే కదా !!
రచనలు చేయాలనుకునే వాళ్ళూ... కవిత్వం రాయాలను కునే వాళ్ళూ ముందు బాగా చదవాలి - చదవాలి అని అనుభవజ్ఞులు చెప్పే మాటల కర్ధం వాళ్ళ రచనలు చదివి వరవడిగా వాళ్ళ శైలీ, శిల్పాలలో రాయమని కాదు !
ఇలాంటి మౌలిక సూత్రాల విషయ విశేషాలనుబాగా చదివి  తెలుసుకోమనే... !! 
సాహిత్యంలో...రసము,ఛంద స్సు,అలంకారాలు... ధ్వని, శబ్ద శక్తులు... విమర్శ, సమీక్షల విధి 
విధానాల వైవిధ్యాలను వీటిని 
వీటినే చదవాలని వారిసూచన!
వీటన్నింటికంటే ముందు... ఒక కవి, రచయిత, లేదా సాహితీ వేత్తకు ఉండవలసిన ప్రధాన లక్షణం సమాజ స్థితిగతులను సునిసితం గా సమగ్ర పరిశీలన,
స్పందించే తత్త్వం ! తదనుగుణంగా ప్రతిస్పందించే నైజం ఉండి  తీరాల్సిందే !
   అంతేగానీ... మనముందు తరాలవారి రచనలను చదివి,
చదివి మక్కికి,మక్కీఆవిధానా లలోనే రాయాలనికాదు !వాళ్ళ శైలీ, శిల్ప విన్యాసాలలోనే రాయమని కాదు !!
 నీవు రాసే రచనల్లో, కవితల్లో 
నీదంటూ ఓ ప్రత్యేకమైన శైలీ శిల్పాలనుసృష్టించు కోగలగాలి 
నీ ప్రత్యేకతను నీవు నిరూపిం చుకోగలగాలి,అదీ గొప్పతనం!
      *******
కామెంట్‌లు