తిరుమల విశేషాలు: జ్యోతి వలబోజు

  అనుకోకుండా ఒక్కరోజు ముందు ట్రెయిన్ టికెట్ బుక్ చేసుకుని కొడుకు, కోడలు, మనవడితో తిరుపతి ప్రయాణం చేయవలసి వచ్చింది..  ఇంతకుముందు రెండు సార్లు  బ్రేక్ దర్శన్, రూమ్, ట్రెయిన్ అన్నీ రిజర్వేషన్ చేసుకుని ఒకటి రెండు రోజుల ముందు అనివార్య పరిస్థితిలో కాన్సిల్ చేయడం జరిగింది. కాని ఈసారి రిజర్వేషన్ లేకుండా తిరుపతి ప్రయాణం సాధ్యమైంది. అబ్బాయికి బ్రేక్ దర్శన్ లెటర్ ఉండడం వల్ల మేము కూడా వెళ్లాం. తత్కాల్ లో దొరకకుంటే, ప్రీమియం తత్కాల్ లో డబుల్ ధరకు వెళ్లేటప్పుడు, వంద ఎక్కువ పెట్టి రిటర్న్ లో ట్రెయిన్ టికెట్స్ ఒక్కరోజు ముందు బుక్ చేసుకున్నాం. ఈ విషయంలో అందరికీ ఉపయోగపడతాయని కొన్ని విషయాలు చెప్తున్నాను.
1. దర్శనం టికెట్ ఉంటేనే తిరుమల పైకి అనుమతిస్తున్నారు.  300 టికెట్లు ఆన్లైన్ తీసుకోవాలి. ఆఫ్లైన్ ఇవ్వట్లేదు. 
2. రిజర్వేషన్ లేకుంటే ట్రెయిన్ లేదా బస్సు దిగగానే, కార్ లో వెళ్లినా శ్రీనివాసం కాంప్లెక్స్ కి వెళ్లి ఉచిత దర్శనం టికెట్ తీసుకోవచ్చు. టైమ్ స్లాట్ ఇస్తారు. దర్శనానికి చాలా టైమ్ ఉంటుంది. ఆధార్ కార్డ్ ఉండాలి. ఫోటో తీసుకుని టికెట్ ఇస్తారు. ఈ టికెట్ మీద ఒకసారి టికెట్ తీసుకుంటే మరో నెల వరకు మళ్లీ ఇవ్వరు. 
3. పైన రష్ బానే ఉంటోంది. రూమ్ రిజర్వేషన్ ఉంటే తొందరగా ఇస్తారు. దానికి కూడా లైన్ ఉంటుంది. లేదంటే క్రిందనే హోటల్ లో ఉండి పైకి వెళ్లి దర్శనం చేసుకుని రావాలి. శ్రీనివాసంలో లాకర్లో సామాను పెట్టుకుని డార్మిటరీ హాల్స్ లో చాప, దిండు జత పది రూపాయల చొప్పున అద్దెకు తీసుకుని ఉండొచ్చు. శుభ్రంగా ఉన్నాయి. మేము ఆరుగంటలు అలా ఉన్నాం..  శ్రీనివాసంలో ఉచిత అన్నదానంలో తిన్నాం కాని ముందటి రుచి లేదనిపించింది. పెరుగన్నం కాని సాంబారన్నం కాని.. 
4. ఫైన హోటల్స్ మూసేసారు అని అన్నారు కాని అన్నీ తెరచి వున్నాయి. వెంగమాంబ సత్రంలో అన్నదానం జరుగుతూనే ఉంటుంది. లోపలికి వెళ్లేవాళ్లు వెళ్తుంటారు. తినేసి మరోవైపు నుండి బయటకు వస్తుంటారు. ఫాస్ట్ ఫుడ్ లాంటివి అన్నీ తెరచి వున్నాయి. 
5. క్రింద గుళ్లలో మామూలే.. చాలాచోట్ల పూజారులు ఎడమచేయి చాచి ఉంచి డబ్బులు తీసుకుని పేరు గోత్రం చదివేస్తున్నారు దేవుడి వైపు తిరక్కుండానే.. మమ అన్నట్టు. 
ఆటోలు, క్యాబ్ ల సంగతి చెప్పేదేముంది. డీజిల్ రేట్లు పేరిగాయంటారు. దానికన్నా ఓలా, ఊబర్ బెస్ట్. బేరమాడే పనుండదు. 
25% మాత్రమే మాస్క్ పెట్టుకుంటున్నారు.
పరిస్థితులు చక్కబడుతున్నాయి  కాని మునుపటిలా ఉండకపోవచ్చునేమో. షాప్స్ అన్నీ తెరిచారు. ఆర్ధికంగా చాలామంది నష్టపోయారు. క్రింద ఉన్న మయూర హోటల్ మూసేసారు. పైన సారంగి కూడా మూతబడింది. చిన్న చిన్నవ్యాపారస్తులు కాస్త నయమేమో.
ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని హాయిగా వెంకన్నని దర్శించుకోండి.. శ్రీవారి మెట్లు సైడ్ ఇంకా మూతబడి ఉంది. ఇటీవలి వర్షాలకు చాలా దెబ్బ తిన్నదంట.
పైన రష్ బానే ఉంది. రూమ్స్ ఫుల్ ఉన్నాయి కాని తిరుమల ఖాళీగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఎవరినిబడితే వాళ్లని పైకి వెళ్లనివ్వట్లేదు కదా.. ఈ పద్ధతి ఇలాగే కొనసాగిస్తే మేలేమో..
కామెంట్‌లు