ఆల్బర్ట్ ఐన్ స్టీన్;-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
 (14 మార్చి 1879-18 ఏప్రియల్ 30)
శీర్షిక:- తత్వవేత్త గా మారిన శాస్త్రవేత్త ఐన్ స్టీన్
................................
ద్రవ్య శక్తి తుల్యతా నియమం( సాపేక్ష సిద్ధాంతం)  ద్వారా పరమశక్తివంతమైన అణుబాంబు కనుగొని 
నేటికి ద్రవ్యరాశి శక్తి సూత్ర ఫార్ములా శాస్త్ర విజ్ఞానము లోనే  ప్రసిద్ధిగాంచినది గా పరిగణించబడిన అది అనేక మంది వినాశానానికి కారణమైనదని వ్యథ చెంది తత్వవేత్తగా మారిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ మీకివే శతకోటి వందనములు.......!!
ఐజాక్ న్యూటన్, మహాత్మా గాంధీ లు నాకు ఆదర్శమన్న  మీరు జీవితచరమాంకాన్న శాంతి యే మనుగడకు సామాజిక అభివృద్ధికి కారణమని భావించి ఆచరణలో పెట్టిన మహానుభావులు
ఫోటో ఎలక్ట్రిక్ ఫలితం నకు ప్రపంచ ఉన్నత పురస్కారం ను పొంది
ఎందరో శాస్త్రవేత్తలకు మార్గదర్శకులైన మీరు
జర్మనీలో జన్మించినా విద్యాభ్యాసం స్విట్జర్లాండ్ లో చేసి అమెరికాలో  పనిచేసినా, అనేక పదవుల, పురస్కారాలకే వన్నె తెచ్చిన మీరు  సదా స్మరణీయులు 
మీకివే వసుదైక కుటుంబ ప్రజల వందనములు....!!


కామెంట్‌లు