కంద పద్యాలు;-మచ్చ అనురాధ-యస్.ఏ.తెలుగు -జి.ప.ఉ.పా.కుకునూర్ పల్లి, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా.
1. పరమేశ్వర శ్రీ శంకర
వరములనొసగేటి తండ్రి భారము నీదే!
కరుణను జూపుము మాపై
నిరతము  పూజలను జేతు నీలగళుండా!.

2. పరిపరివిధముల నామము
స్మరణను జేసెదను సాంబ సాధనతోడన్ ,
గరళము మ్రింగినయటులన్
మొరవిని  యిడుములను బాపు భోగివిభూషా !.

3. ధర యందున శుభములనే
వరములుగా నిచ్చె దేవ వాసిగ గొల్వన్ !
కరమున శూలము నిడుకొని
మరువక భక్తులను గాచె మంగళ మూర్తీ!.

4. శిరమున గంగను దాల్చిన
పరమేశ్వర మమ్ము బ్రోవ పరగను రావా!
కరములు ముకుళించియు నీ
చరణము కొలిచెదను స్వామి శంకర శంభో!.


కామెంట్‌లు