సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 సింగిడి రంగుల హోళీ*
******
 జీవితమంటే నవరసాలు, షడ్రుచుల సమ్మిళతమే కాదు, సింగిడి రంగుల మేళవింపు కూడా…
అనుభూతుల నవరసాలు భావోద్వేగాలను ప్రభావితం చేస్తే..
అనుభవాల పాఠాలు షడ్రుచులై నడిపిస్తుంటాయి.
ఉల్లాసం, ఉదాసీనత, ఉద్యమం, ప్రశాంతత, స్వచ్ఛత వీటన్నింటికీ
ప్రతీకలైన వర్ణాలతో జీవితం ముడిపడి ఉంటుంది.
వివిధ కోణాల్లో జీవితాన్ని వర్ణభరితం చేసే  సింగిడి రంగుల హోళీ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుందాం.
హోళీ పండుగ శుభాకాంక్షలతో 💐

కామెంట్‌లు