బ్రతుకుబాట ** చివరిగా **-* కోరాడ నరసింహా రావు **
 
   ***   108   ***
క్రితంజన్మలో  పుట్టెడు పాపాలు
పిడికెడు పుణ్యాలుమూటగట్టు కుని  ఈ జన్మ మెత్తిన నేను... 
ఆ పాప, పుణ్యాల ఫలాలనన్నీ 
అనుభవించేసాననే అనుకుం టున్నాను !
నా బ్రతుకు బాటలో ఎన్నెన్నో పరిచయాలు, ఎన్నెన్నో అనుభ వాలు, ఖేదాలు, మోదాలు... !
నాకింక  ఎటువంటి కర్మలూ 
వద్దు,జన్మలూ వద్దు !!
 నా సాధారణ జీవితంలో... నేనుగడిపిన నా సాహిత్య జీవితం నాకు అసాధారణ మైనదే !
ఇందులోనే నేను కాస్త ఊరటని, హాయిని, ఆనందాన్ని...శాంతి, సమాధానాలను పొందాను అన్నది అక్షర సత్యం !
ఆ చదువులతల్లి అనుగ్రహం చేత నాబుద్ధి సానుకూలంగా స్పందించి సమాజం పట్ల సరైన అవగాహనతో నా సాహితీ వ్యవసాయం కొనసాగించి మంచి సేద్యమే చెయ్య గలిగా  నని అనుకుంటున్నాను !ప్రత్యక్షంగా నేనుచూసిన 
 నాకుటుంబ సభ్యుల జీవితానుభవాలనే నేను  కధలుగా రాసాను, తదు పరి నేను అతిదగ్గరగా చూసిన మిత్రుల, పరిచయస్తుల విషయ సంఘటనలనూ  కధలుగా మలిచాను !
సమాజంలో జరిగిన యే సంఘటనైనా నన్ను కదిలించి కవితగానో,కధగానో,గీతంగానో
గేయం గానోఅక్షరరూపందాల్చ
టం, నా అదృష్టం !
నాకుప్రియమైనబాలగేయాలను శతాధికంగా రాసాను !నా ఆధ్యాత్మిక చింతనలు చాలావరకు వ్యాసరూపం దాల్చాయి !
అవన్నీ... తొలినాళ్లలో పత్రికలలో ప్రచురితమైనవి... 
దొరికినంతవరకూ కొన్ని భద్రపరచగలిగాను  ! పత్రికలను విడిచిపెట్టిన తరువాత వాట్సాప్  గ్రూప్ లలోకి వచ్చి, కొన్ని ప్రతిలిపిలోను, కొన్ని సంకలనాలలోను, మరికొన్ని ఆయా గ్రూప్ ల బ్లాగు లలోనూ 
ఉన్నప్పటికీ... చాలావరకూ 
ఏరోజుకారోజు, రోజుకొకటి, రెండు, ఒకోరోజు మూడు ఆర్టికల్స్ రాసినా అవేవీ నేను భద్రపరచలేదు !ఏరోజురచనల  నా రోజే డిలీట్ చేసేస్తున్నాను !
నాకింక ఎటువంటి ఆశలు, ఆశయాలు, కోరికలూ లేవు !
ఆ మృత్యువు ఏ క్షణంవచ్చినా స్వాగతిస్తూ నేను సిద్దంగానే ఉన్నాను !ఈ అభిప్రాయం ఇప్పుడు ఈరోజుల్లో కలిగినది కాదు ! నా ఇరవయ్యో ఏటనే నామదిలో గాఢంగా స్థిరపడిపోయిన అభిప్రాయం !
నాకు తారసపడిన మిత్రుల్లో... 
DR.KLV.ప్రసాద్గారుచివరివారు
మంచి స్నేహశీలి, విద్వత్తును ప్రేమించి, ప్రోత్సహించే మనస్తత్వం వారిది !జీవితం లో ఎన్నో సాధించినా, అతి సాధారణంగా ప్రవర్తించటమే అతని గొప్పతనం, నిగర్వి !!
వారే... నేనీ  బ్రతుకుబాట
శీర్షికన నాజీవితాన్ని పాఠక మిత్రులందరికీ పరిచయంచేసే 
భాగ్యాన్ని కలుగ జేశారు, వారికి 
నన్ను అమితాభిమానంతో ప్రోత్సహించిన" మొలక " కార్య నిర్వాహక వేదాంత సూరి గారికి నా హృదయపూర్వక కృతాజ్ఞ తాభి వందనములు !
నా ఆలోచనలు, అభిప్రాయా లతో ఇతరులను గురించి పొరపాటుగా వ్యక్తీకరించినా, 
తన్మూలంగా ఎవరిమనసునైనా నొప్పించినా నన్ను దయతో క్షమించవలసిందిగా మనఃపూ  ర్వకంగా  ప్రార్ధిస్తున్నాను !
నాకు మొదటినుండీ ఒక 
ఆలోచన ఉండేది... నేనీ జన్మ నెత్తి ఎవరికీ యే విధంగానూ ఉపయోగ పడ లేక పోయాను!
కనీసం నేను మరణించే సమయంలోనైనా నా అవయవాలు ఎవరికైనా ఉపయోగ పడితే బాగున్ను అని, యే వైద్య విజ్ఞాన పరిశోధనా కేంద్రం వారైనా.. 
నాశరీరాన్ని పూర్తిగా పరిశోధిస్తే 
వైద్యశాస్త్రానికి ఉపయోగపడే 
కనీసం ఒకటి, రెండు కొత్త విషయాలైనా బయటపడి వైద్య శాస్త్రానికి, తద్వారా రోగులకుఉపయోగపడుతుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం !
నా ఈ అభిప్రాయాన్నిమునుపు  ప్రకటించినా తగిన ప్రతిస్పందన తో ఎవరూ నాకు సహకరించ లేదు !
వైద్యసంబంధ  పరిశోధనలు వేటికైనా...  ఎవరైనా నన్ను వినియోగించుకోటానికి ముందుకు వస్తే నేను వారికి సహకరించటానికి సిద్ధంగా ఉన్నాను ! ఇంక నాకుసంబం ధించి చెప్పుకో  టానికింకేమీ లేవు !ఈ మానవ ప్రపంచం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ సర్వేశ్వరుని ప్రార్ధిస్తూ....🙏💐🙏ఇప్పటి కికసెలవు...! కోరాడ. 🙏💐🙏
     *****

కామెంట్‌లు