అలుపెరగని పోరాటయోధుడు.. వాడ గంగరాజు;-జరుగుమల్లి వీరయ్య కలికిరి కొటాల,


 మంచికి మారుపేరు
మానవత్వానికి ప్రతి రూపం
సుగుణ సుగంధాల
చిరు దరహాసం
విప్లవ పోరాట యోధుడు
యువతరానికి మార్గదర్శకుడు
రంగం ఏదైనా.. మానవ సేవ చేయాలనుకునేవారికి మార్గాలనేకమని 
నిరూపిస్తున్న మహిమాన్వితుడు.. వాడ గంగరాజు...!!
అనునిత్యం
సమాజ హితం కోరి
ప్రజా పోరాటాలతో మమేకమై
ఉజ్వల భవిష్యత్తుకు రథసారధిగా నిలుస్తున్న
"వాడా గంగరాజు" కృషి ఫలితం
ఊరూరా అందుకున్న చైతన్య ఉద్యమం.!
కరుణ కురిసే విశాల నేత్రద్వయం
సాంత్వన చేకూర్చే వాడా గంగా రాజు రూపం..!!
ప్రజా సమస్యల సాధన పోరాట రంగంలో
విశేష అనుభవం ప్రతిభ, మూర్తిభవించిన వ్యక్తిత్వం..!!
ప్రజా సమస్యల సాధనలో
పోరాట పటిమను ఆయుధంగా మలిచి
సమకాలీన సామాజిక నంఘటనలకు
స్పందించి
దాపరికం లేని అభివ్యక్తీకరణతో
హృదయాన్ని కదిలించి
పోరాట ఉద్యమ రంగంలో
అనునిత్యం నిరంతరం శ్రమించే
ఉద్యమ పోరాటయోధుడు.. వాడ గంగరాజు..!!
ఊహల కన్నా వాస్తవాలే
దర్పణంగా చేసుకొని
ఆలోచనే అడుగులే
దిక్సూచిగా మలుచుకుని
స్వయంకృషితో ఉద్యమ పోరాట నాయకత్వంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు గా నియమింపబడి
ఎన్నో మెలికల మధ్య..
మరెన్నో మలుపుల మధ్య..
ప్రజా సమస్యల సాధన పోరాటంలో
సమస్యల పట్ల నిజాయితీ, నిర్భీతి..
నిష్పక్షపాత ధోరణితో స్పందిస్తూ..
ప్రజాసేవలో
అలుపెరగని పోరాటం అనునిత్యం నిరంతరం చేస్తూ...
అభాగ్యుల అశ్రుజలాలను
ఆనంద భాష్పాలు గా మార్చే
నిజమైన సిఐటియు చిత్తూరు జిల్లా నాయకులు 
గౌరవనీయులు వాడా గంగరాజు...!! గారు నేడు జన్మదినం జరుపుకుంటున్న శుభ సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు.. 
               
కామెంట్‌లు