శోభ నిచ్చేది అదే ; కోరాడ నరసింహా రావు !
 కూడనిది కావాలని మనసు 
మొరాయించి మారాము చేసి నపుడు... సంస్కారమే అడ్డుపడి, మనసునుమం దలించి, పరువు నిలుపు తుంది ... !

గొప్ప, గొప్ప చదువులు చదివేసి నంత మాత్రాన 
అందరూ సంస్కారవంతులు కాగలరా.... !?

సంస్కారం, జన్మతః కొంత 
తల్లిదండ్రుల మూలంగా కొంత 
పరిసరాలవలన కొంత..., 
స్నేహితుల సహవాసంతో కొంత  ఉపాధ్యాయుల నుండి కొంత, వంటబట్టించుకొనేదే  ఈ సంస్కారగంధం !అదృష్టం కొద్దీ 
అందరూ  మంచివారే దొరికితే 
సత్సంస్కారం అంటి.... పరిమళించి మంచి పేరు వస్తుంది  !

సంస్కారమంటే.. సమాజంలో 
వ్యక్తిగా... సభ్యతతో  ప్రవర్తించ వలసిన జీవనవిధానమేనోయ్!
ఒరు లే వవి యొనరించిన, అ ప్రియము మనమునకు., నీవవి పరులకు చేయ కుండుటే సంస్కారమంటేనూ !

విద్యవలన విర్రవీగక, వినయ ముగ నుండుటే నోయ్ సంస్కార మంటేనూ... !!

డిగ్రీలు... ధన, కనక, వస్తు వాహనాలు, ఉన్నత పదవులు కాదోయ్ మనిషికి భూషణం !
ఉత్తమ సంస్కారమే మనిషికి చక్కని భూషణం ! మానవజన్మకు సార్ధక్యం, సంస్కారమే !!
   ******

కామెంట్‌లు