ఎవరికి ఏమి ఎరుక?;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
సూక్తులుచెప్పుట
సన్మార్గులకెరుక
దుర్భాషలాడె
దుర్మార్గులకేమెరుక

ఉపకారాలు చేయుట
ఉత్తమములకెరుక
కీడును చేసే
కిలాడులకేమెరుక

సమాజసేవలు చేయుట
సజ్జనులకెరుక
అఘాయిత్యాలు చేసే
అధములకేమెరుక

మహనీయులను గౌరవించుట
మంచివారికెరుక
పెద్దాచిన్నా తేడాతెలియని
పెంకిఘటాలకేమెరుక

కష్టాలనున్నవారిపై జాలిచూపుట
కరుణాత్ములకెరుక
కళ్ళుమూసుకొని తిరిగే
కఠినాత్ములకేమెరుక

ధర్మాధర్మములు
పుణ్యాత్ములకెరుక
న్యాయాన్యాయాలు
పాపాత్ములకేమెరుక

భజనలుచేయుట
భక్తులకెరుక
నమ్మకాలులేని
నాస్తికులకేమెరుక

దానముచేయుట
దాతలకెరుక
పైసాపైసాప్రోగుచేసే
పిసినారులకేమెరుక

గేయాలుపాడుట
గాయకులకెరుక
గట్టిగ ఓండ్రించే
గాడిదలకేమెరుక

కుటీరాలనుకాచుట
కుక్కలకెరుక
నక్కినక్కిదాగే 
నక్కలకేమెరుక

గానముచేయుట
కోకిలలకెరుక
గోలగనరిచే
కాకులకేమెరుక

కమ్మగకవితలువ్రాయుట
కవీశ్వరులకెరుక
అంధకారములోనున్న
అఙ్ఞానులకేమెరుక


కామెంట్‌లు