నా చెలియ;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నా వయ్యారి
ఎందుకో
పువ్వులా
నవ్వుతుంది

నా భామ
ఎందుకో
మల్లియలా
మెరుస్తుంది

నా వనిత
ఎందుకో
గులాబిచేతికిచ్చి
గుబులులేపింది

నా నెచ్చెలి
ఎందుకో
మందారంలా
మకరందాన్ని అందిస్తుంది

నా ప్రియురాలు
ఎందుకో
చామంతిలా
చాలా చక్కగాయున్నది

నా ఇంతి
ఎందుకో
బంతిపూవులా
బలేబాగుంది

నా నెలత
ఎందుకో
కనకాంబరంలా
కళకళలాడుతుంది

నా సకియ
ఎందుకో
సన్నజాజిలా
సన్నబడి సొగసులనారబోస్తుంది

నా నారి
ఎందుకో
సంపంగిలా
సుగంధాన్ని చల్లుతుంది

నాచెలి ఇలాగే
వన్నెచిన్నెలతో
ఇంపుసొంపులతో
వికసించాలి విరబూయాలి


కామెంట్‌లు