*** 107 ***
సమాజహితేన సాహిత్యం !
సమాజ హితమును ఆశించి...
సమాజానికి శ్రేయస్సును చేకూర్చేదే సాహిత్యం ! ఇది వట్టి మాటలవరకేనా... చేతలకొచ్చేసరికి...స్వయం సయ్యమనాన్ని సాధించుకోలేక
తమ రచనా సామర్ధ్యంతో... ఉద్రేకాలు,కక్షలు,కార్పణ్యాలను
రెచ్చగొట్టి...అశాంతిని,అలజడు లను సృష్టించి అస్థిరతను నెల కోల్పాటమేనావివేకం...ఒకప్పటి గతించిన సమస్యలను కెలికి
అప్పటి పరిష్కార మార్గాలను ఇప్పటి తరాలకు ప్రతిపాదిం చటం సమంజసమా... !?
ఫెమినిష్టనికొందరు,దళితవాదమని కొందరు,దిగంబరమని కొందరు, ఇలా అనేక వాదాలతో
తీవ్రవాదభావజాలాన్నిప్రేరేపిస్తూసమాజాన్నిపిచ్చెక్కించటం, ఎంతవరకూ సబబు !?
చలం లాంటి గొప్పవ్యక్తి.. ఆఖరి రోజుల్లో తన రచనలను ఏ ఒక్కరూ పరిగణన లోకి తీసుకోవద్దు అంటూ తానుసాహిత్యం పేరుతో ప్రజలకందించింది మంచి కాదు
అనే సత్యాన్ని గ్రహించి పెద్ద మనసుతో తన తప్పును తాను ఒప్పుకున్నా సమాజానికొరిగే దేమిటి... !?
కనీసంఅతనిలాచేసినపొరపాట్లను నిజాయతీతో ఒప్పుకోగల వారెందరున్నారు... !?
ఇలాంటి ఆలోచనలతో మనసు ఆవేదన చెందుతున్నా
నేను చెయ్యగలిగిందేముంది ?
సామాజికుల సుఖదుఃఖాల
ప్రతిస్పందనగా సమాజంనుండి
పుట్టిన సాహిత్యం ఈ సమాజ వికాసానికే దోహదపడాలి కవులు,రచయితలు,కళాకారుల ప్రధాన లక్ష్యమిదే ! గానీ
గాంధీగారన్నట్టు... మనకు ఉదాత్త మైన ఆశయాలుంటే సరిపోవు... అవి సాధించటా నికి ఉత్కృష్టమైన ఆచరణ విధానముండాలి !
కవి, లేదా రచయిత... సమస్యలకు శాంతియుత పరిష్కారాన్ని సూచించాలి,
రెచ్చగొట్టి మరిన్ని సమస్యలను
సృష్టించకూడదు కదా !
కందుకూరి, గురజాడ, జాషువా
ఇలాంటిభావజాలం, సాహిత్య సృష్టి సమాజానికందించే మంచి తరం తయారవ్వాలి !
చెడును,చెడుగా తెలియ జెప్పాలి... పాఠకులనుకూడా చెడ్డవారిగా తయారుచెయ్యకూ డదు కదా..!!
మనసా, వాచా కర్మణా నేనిలాగే ఆలోచిస్తాను ! ఇలాగే ప్రయత్నిస్తాను !నాసాహిత్యాన్నికూడా తదను గుణం గానే కొనసాగిస్తాను !
*******
........... సశేషం .........
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి