సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 కొందరితో...
******
కొందరితో మాట్లాడితే..  ఎంత బాధనైనా ఓర్చుకునే, సహనం దేనినైనా  అలవోకగా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది.
కొందరితో మాట్లాడితే...
మనసు చుట్టూ  ఆవరించిన
ఓ మలయ సమీరంలా,పూల పరిమళాలను ఆస్వాదించినంతగా అద్భుతమైన అనుభూతి కలుగుతుంది.
 కొందరితో మాట్లాడితే...
అలజడుల అల్లు లేని,అంతులేని ప్రశాంతత మనసులో నిండుతుంది.
 ఇక కొందరితో మాట్లాడితే...
వాళ్ళను వాళ్ళ కుటుంబ సభ్యులు, చుట్టూ ఉన్న వారు ఎలా భరిస్తున్నారో కదా అనిపిస్తుంది..
ఎంతో చిరాగ్గా, అసహనంగా , వాళ్ళ నుంచి చాలా దూరంగా పారిపోవాలనిపిస్తుంది.
మాటలే కదా వ్యక్తిత్వపు ఆభరణాలు,మనసులను దగ్గరకు చేర్చే బంధాలు..
 హృదయాలను గెలుచుకునే అస్థిత్వ ప్రతీకలు . ప్రేరణను కలిగించే దీపికలు.మనో రుగ్మతలను నయం చేసే ఔషధ గుళికలు.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు