సునంద భాషితం;-వురిమళ్ల సునంద ఖమ్మం
 చేతులు- చేతల్లోనే...
*******
కష్టించి పనిచేసే వారమా, కష్టపెట్టి బతికేవారమా.. కన్నీళ్ళు తుడిచేవారమా,కఠిన పాషాణ హృదయులమా అనేది మన చేతులు,చేతలే చెబుతాయి.
చేతులు ఎంత గొప్పవో కదా...
శ్రమ జీవన విలువలకు ప్రతీకలై నిలుస్తూనే, చేతనైనంత సాయానికి, సాటి వారి కన్నీళ్ళు తుడవడానికి ముందుంటాయి.
చేతలు ఎంత ముఖ్యమో కదా..
వ్యక్తిత్వాన్ని అద్దంలా స్పష్టంగా చూపిస్తూ, సమాజంలో తనదైన గుర్తింపు, గౌరవాన్ని  తెచ్చిపెడతాయి.
అందుకే.. చేతులు, చేతల్లోనే మనిషితనం కనబడుతుంది. 
ఇవి సరిగా ఉంటేనే మనిషిగా జన్మ సార్థకం అవుతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు