ఆడపిల్లలు ఇంటి దేవతలు;-కాటేగారు పాండురంగ విఠల్;-కలం స్నేహం
మనసులు మనుషుల కలయికే వివాహబంధం
భార్యాభర్తల ప్రేమ చిహ్నమే సంతానం

అడపిల్లలంటేనే అదృష్టం ఇంటికి దేవతలు
తల్లిదండ్రుల ఆత్మీయానురాగపు పూల పల్లకీలు

సంసారమొక సాగరం బరువు బాధ్యతల సంగమం
కుటుంబానికై చేసే కష్టం తండ్రికి కానేకాదు భారం

ఇంటికి దీపం ఇల్లాలు ప్రేమను వర్షించే మేఘం
ఓర్పు నేర్పు కూర్పుల అమృతమయ కలశం

ఆమ్మానాన్నలకు ఇద్దరమ్మాయిలే రెండు కళ్ళు
వారుంటే ఇల్లే నందనవనం ముత్యాల లోగిళ్ళు

కల్పవృక్షమై తండ్రి కోరిన వరాలను తీర్చును
కామధేనువై తల్లి సుఖసంతోషాలను పంచును

ఆలన లాలన పాలనల అభయహస్తం అమ్మ
కరుణ ఆదరణ దీవెనల ప్రియనేస్తం అమ్మ

నడక నడత నడవడికల సమాహారం నాన్న
కనిపెంచినన్నూ కనిపించని ప్రేమసాగరం నాన్న

స్వాతిముత్యముల వలే తమ పిల్లలు మెరవాలని
ధృవతారల వలే దేదీప్యమానంగా వెలగాలని
సీతాకోక చిలుకలు వలే స్వీచ్చగా విహరించాలని
సప్తవర్ణ సింగడియై ఆకాశాన విరియాలని

తన అలసటని ప్రేమగా మలచుకుంటుంది అమ్మ
బిడ్డల అల్లరిని మనసారా భరిస్తుంది అమ్మ
వారి అవసరాలను బాధ్యతగా భావించును నాన్న
వారు సంతశిస్తే తెగమురిసి పోవును నాన్న


కామెంట్‌లు