అందరు ఒక్కటే, పిల్ల లందరు
ఒక్కటే !
చదువుల తల్లి ఒడిలో మీరందరూ ఒక్కటే, పిల్లలు
అందరూ ఒక్కటే !
పేదాగొప్పా తేడాలొద్దు...
కులాలు, మతాలు చూడవద్దు
బేధం తెలియకూడ దనే
స్కూలుకు యూనిఫాము లను పెట్టారు !
స్నేహంతో కలిసి - మెలిసి ఆటలు ఆడుకోవాలి, చక్కగ చదువులు చదవాలి !
సుహృద్భావము చూపాలి
సమైక్యతను నిలబెట్టాలి !
భావిభారత పౌరులుమీరు
దేశప్రగతికి కారకులై...
శాంతి సౌఖ్యాలు నెలకొల్పి...
శహభాష్ అనిపించాలి...
కన్నవారికి, ఉన్నఊరికి
దేశానికె ఖ్యాతిని తేవాలి !
ప్రపంచంలొ మనభారతదేశపు
ఔన్నత్యాన్ని పెంచాలి !
అందరు ఒక్కటే... పిల్ల లంద
రూ ఒక్కటే !
పెదా,దనిక తేడాలున్నా...
కులాలు, మతాలు ఏవైనా...
మనమందరం ఒక్కటే...
పిల్లలూ... అందరమొక్కటే !
*****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి