బాల సాహిత్యం --కొండలు ---యం .వి .ఉమాదేవి--ఇందుకూరు పేట.నెల్లూరు
కొండలోయ్ కొండలు 
మనకు అండదండలూ 
రమ్యమైన కొండలు 
రంగురాళ్ళ బండలు !!

పొలిమేరలో కొండలు 
పొలం గట్టి గుండెలు 
వాననీరు పారుతుంది 
నిండియుండు కుంటలు !!

పెరుగు చెట్టు చేమలు 
తిరుగు వన్య ప్రాణులు 
ఏడు పెద్ద కొండలు 
సప్తగిరిని దివ్యులు !!

పులుగులుండు కొండలు 
ఎలుగు దాగు బండలు 
పైన తిరుగు మబ్బులు 
బాగ కురియు వానలు !!

దొరుకు పుట్ట తేనెలు 
విరివిగను మూలికలు 
జలపాతం సవ్వడులు 
హిమగిరులు సొగసులు !!

ఎం .వి .ఉమాదేవి 
✍️ వనజ .
7842368534

కామెంట్‌లు