గుడ్డినమ్మకం! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఏరోజు ఎప్పుడు ఎలా ఎవరుమారుతారో తెలీని స్థితిలో ఉన్నాం.దురాశ డబ్బు కాపీనం చెడుసావాసాలతో మనిషి మనిషి కి మధ్య గోడలు లేస్తున్నాయి.ఒక కుటుంబం లో ఉన్న వారికే ఐకమత్యం లేకుండా పోతోంది. ఇదితెలియజెప్పే కథలెన్నో ప్రపంచ సాహిత్యం లో ఉన్నాయి.కమలములు నీటిలో ఉన్నంత సేపూ విచ్చుకుని కళకళలాడుతూ ఉంటాయి. నీటినించి బైట పడేస్తే వాడిపోతుంది.కాలంఖర్మం కలిసి రాకపోతే మిత్రులే శత్రువులవుతారు.ఆపాతదిగుడుబావిలో తరతరాలుగా కప్పలు ఉంటున్నాయి. కప్పలరాజు ముసలి దైపోటంతో మిగతా కప్పలు తిరుగు బాటు చేశాయి. తామే ఆపదవి పొందాలనే దురాశ వాటిలో పోటీతత్వం పెరిగిపోయింది. మంత్రి కూడా ఎదురు తిరగటంతో కప్ప రాజు తనపరివారంతో వేరే చెరువులో చేరి కాలక్షేపం చేస్తోంది. ఆచెరువుగట్టుపై చెట్టుకింద ఓపుట్టలోంచి పాము పిల్ల బైట కి వచ్చి "కప్ప తాతా! ఏంటీ మీరు కొత్తగా వచ్చారా?"అని పలకరించడం తో ఉబ్బితబ్బిబ్బు ఐంది కప్ప రాజు. "అవును నాయనా!నామంత్రికూడా ద్రోహం చేశాడు.అందుకే నాకుటుంబంతో ఇలావలస వచ్చాను ఆదిగుడుబావి వదిలి"."ఇక్కడకి ఎవరూ రారు.ఎంచక్కా పిల్లాపాపలతో ఉండు.నాతో ముచ్చట్లు చెప్పవచ్చు. "అని ఎక్కడ లేని ప్రేమ ఆప్యాయత ఒలకబోసింది.కప్పల సంతతి బాగా పెరిగింది. కప్ప రాజు కి పాము పై నమ్మకం కుదిరింది. మూడు నెలలు గడిచాక కప్ప అంది"మనవడూ! నాశత్రువులను మింగి నాపగ చల్లార్చు.నీకు ఆబావిని చూపుతాను"అనగానే పాము బైలుదేరింది.దూరంగా ఉన్న కప్ప చూస్తూ ఉండగానే  బైట ఎగురుతున్న మంత్రి కప్పను పాము గుటకాయస్వాహా చేసింది. రాజు కప్ప ఆనందం తో శభాష్ అని వెర్రి గంతులేసింది.పాము రోజూ  అక్కడికి వెళ్ళి దొరికి న కప్పలను హాంఫట్ చేసింది. త్వరలోనే పాము బాగా దిట్టంగా తయారైంది.  "తాతా!దిగుడుబావిలోని కప్పలు అన్నిటినీ అప్పడాలు లాగా కరకర లాడించాను.నీవు ఇక నీకుటుంబంతో అక్కడి కి వెళ్లు"
అన్న పాము తో"వద్దు!చెరువు లోనే మాసంతతి బాగా పెరిగింది. "అన్న తాతపై కోపం ముంచుకొచ్చింది. రోజూ కప్పలను రుచి మరిగిన దాని ప్రాణం చెరువులో కప్ప బైట కి వస్తే చాలు గుట్టు చప్పుడు కాకుండా మింగుతోంది.ఆరోజు ముసలి కప్ప రాజు ని కూడా మింగేసింది.అందుకే కొత్త వారి ని నమ్మి మన ఇంటి గుట్టు బైట పెడితే  చివరికి  మనంకూడా బలిఅవటం ఖాయం🌹
కామెంట్‌లు