మానిషికి
శారీరక మానసిక శ్రమలనుండి
ఆటవిడుపు కోసం కల్పించబడిన
కళా రంగాన్ని సినిమా పేరుతో
క్రమంగా వ్యాపారాత్మకంచేసి
సామాన్యులనుండి కోట్లు
కొల్లగొడుతున్నారు!
ప్రభుత్వం తన నియంత్రణలో
వుంచు కోవాల్సిన టిక్కెట్ల ధరలు
నిర్మాతలే నిర్ణయించుకొనే
అవకాశం కల్పించడం వెనుక
అసలు మర్మమేమిటి!?
అదే ఆరుగాలం శ్రమించి
మన్ను నుండి అన్నం తీసి
సమస్త ప్రజలకు అందిస్తున్న
రైతన్నకు మాత్రం
తనపంటకు తానే ధరను
నిర్ణయించే హక్కును
నిరాకరిస్తున్న ప్రభుత్వాల తీరు
వ్యవస్థను అధోగతిలోకి -
నెట్టడమే తప్ప అన్యంకాదు
ఈతీరును ఎండగట్టి
రైతును బతికించుకోవాల్సిన బాధ్యత
మనదే కాదా!?
రైతు భద్రతకు భరోసా కోరాలిమనం!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి