.ధృవుని సంతతి.పురాణ బేతాళ కథ.;- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళుని బంధించి భుజాన మోసుకుంటూ మౌనంగా బయలుదేరాడు. 'మహావీరా నీధైర్యసాహాసాలు చాలాగోప్పవి,నీకుఅమరులు,సిధ్ధులు,సాధ్యులు,
గరుడులు,యక్షులు,కిన్నెరులు,కింపురుషులు,గంధర్వులు,విద్యాధరులు,మునిగణాలు,భూత,ప్రేత,పిశాచ,రుద్రులు,ఉరుగులు,తుషితులు,దైత్యులు,భాస్వరులు,గుహ్యకులు,నరులలో నీకు సాటి లేరయ్య నాకు చాలాకాలంగా ధృవుని సంతతి గురించి తెలుసుకోవాలి అనిఉంది. పురాణిలన్నీంటిని చదవిన నీవు నాకు వివరించగలవా? తెలిసి చెప్పకపోతే తక్షణం మరణిస్తావు'అన్నాడు బేతాళుడు.
'బేతాళా సావధానంగా విను స్వయంభువమనువుకు శతరూపా అనేభార్యకు ప్రియవ్రతుడు-ఉత్తానపాదుడు అనే యిద్దరు పుత్రులు యిందులో ఉత్తానపాదుడికి సునీతి-సురుచి అనే యిరువురుభార్యలు వీరిలోసునీతకు జన్మించినవాడు ధృవుడు.  యితను వాయుదేవుని పుత్రిక ఇల నువివాహంచేసుకున్నాడు, వీరి కి ఉత్కలుడు అనే కుమారుడుజన్మించాడు.మరోభార్య భ్రమిరి అనేభార్యకు కల్పుండు, వత్సరుడు,ధన్య అనేభార్యకు శిష్టుడు ,శంభువు అనేభార్యకు భవ్యుడు,మరియు గర్కుడు,వృషభుడు, వృకుడు,వృకలుడు, ధ్రతిమంతాడు అనేకుమారులుకలిగారు. వీరిలో ధృవుని అనంతరం వత్సరుడు రాజ్యభారంచేపట్టాడు, ఇతనిభార్య సర్వర్ది వీరికి పుష్పార్ణుడు-చంద్రకేతుడు-ఇష్టుడు-ఊర్జుడు-వసువు-యుడు అనేవారుజన్మించారు. వీరిలోపుష్పార్ణునికి ప్రభ-దోష అనే యిరువురుభార్యలుఉన్నారు.ప్రభకు ప్రాతర్మ-థంధని-సాయిలు అనేముగ్గురుపుత్రులు.దోష కు ప్రదోషుడు-నిశీధుడు-వ్యుష్టుడు అనేవారుజన్మించారు .ఇందులోవ్యుష్టుడిభార్య పుష్కరిణి  వీరికి సర్వతేజుడు జన్మించాడు.ఇతనిభార్యఆకూతి వీరికి చక్షస్సు అనే మనువు జన్మించాడు. ఇతనిభార్య నడ్వల వీరికి పురువు-కుత్సుడు-ద్యుమ్నుడు-సత్యవంతుడు-బతుడు-వ్రతుడు-అగ్నిప్టోముడు-అతిరాత్రుడు-సుద్యముడు-శిబి-ఉల్మకుడు అనేవారు జన్మించారు.వీరిలో ఉల్మకునకు అంగుడు-సుమనుడు-ఖ్యాతి-కత్రువు-అంగీరసుడు-గయుడు జన్మించారు.అంగుడుసునీథ దంపతులకు వేనుడు జన్మించాడు అతనిప్రవర్తన నచ్చనిఅంగుడు అడవులకు వెళ్ళిపోయాడు, అదితెలిసిన మునులు శపించగా వేనుడుమరణించాడు, మునులు వేనుడు శరీరం నుండి మునులు నారాయణ అంశంతో బాలుని సృష్టించారు అతనిపేరుపృథుడు ఇతను తొలి చక్రవర్తిగా గుర్తింపు పొందాడు ఇతని పట్టాభిషేకానికి కుబేరుడు బంగారు సింహసనం,వరుణుడు చంద్రకాంతులువెదజల్లే ఛత్రం,వాయుదేముడు వింజామరము,ధర్మదేవత యశోరూపమైన యముడు రాజదండము, బ్రహ్మదేవుడు వేదకవచాలు,సరస్వతిదేవి మంచిముత్యాలదండను, పూలమాలను,ఇంద్రుడుకిరీటం,లక్ష్మిదేవి తరగనిసంపదను,శివుడు ఖడ్గాన్ని,పార్వతిదేవి శతచంద్రా అనేడాలు ,చంద్రుడు తెల్లని గుర్రాలను,త్వష్ట అందమైనరధాన్ని,సూర్యుడు శరాలను,సూర్యుడు అజగవం అనేధనస్సును ,భూదేవి యోగమాయలైన పాదుకలు బహుకరించారు.పృధుభార్య అర్చి ఈదంపతులు నిత్యంహరి నామస్మరణతో వందఅశ్వమేధయాగాలుచేసి సనత్కుమారుడి ద్వారా జ్ఞానభోధ పొంది స్వర్గం చేరాడు ఇది ధృవుని సంతతి వివరం'అన్నాడు వికృమార్కుడు.
విక్రమార్కునికి మౌన భంగం కావడంతో శవంతో సహామాయమై మరలా చెట్టుపైకి చేరాడు బేతాళుడు.బేతాళునికై  పట్టుదలగా మరలా వెనుతిరిగాడు విక్రమార్కుడు.

కామెంట్‌లు