:" శ్రద్ధ";-నలిగల రాధికా రత్న.
1) కుటుంబ పరిధిని
     శ్రద్ధగా పెంచుకోవాలి 
     బాధ్యతలను 
     పంచుకోవాలి.

2) సమాజంలో చెడే కాదు 
    మంచి ఉంటుంది 
     శ్రద్ధగా వ్యక్తిత్వాన్ని 
     మలుచుకో.

3  పిల్లల్ని శ్రద్ధగా
     అలరిస్తుంది కథ 
     పెద్దయ్యే కొద్దీ 
     ఆలోచింపజేస్తుంది.

4)  సీరియల్స్ మోజులో 
      వంట పై శ్రద్ధ పెట్టలేదు 
      శ్రీవారు 
     కడుపు  మాడింది.

5) పిల్లల విద్య గురించే
     హైరానా 
    శ్రద్ధగా సాన పెట్టు 
    విలువైన బాల్యాన్ని!

6) భక్తి మార్గాన 
     శ్రద్ధతో ఉపవాసం 
     భుక్తి తీరక 
     ఎండిన పొట్టల దైన్యం.

7) జీవిత పుస్తకంలో
     ప్రతి పేజీ విలువైందే
     శ్రద్ధగా 
     మంచి పనులు చేస్తే!


కామెంట్‌లు