ముద్దుల పాపాయి(గ ఒత్తు పరిచయం);---గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు
మొగ్గలాంటి పాపాయి
సిగ్గు పడుతూ నడిచింది
నిగ్గుదీసి అడిగింది
బుగ్గకు ముద్దు పెట్టింది

బొగ్గు చేత పట్టింది
ముగ్గు ఒకటి వేసింది
దిగ్గున తను లేచింది
బిగ్గరగా నవ్వింది

మగ్గం చెం

తకెళ్ళింది
రగ్గు మడిచి పెట్టింది
దగ్గుతున్న తాతయ్యకు
దగ్గరగా వెళ్ళింది.

స్వర్గమంటే అమ్మంది
దుర్గమే ఇంటికంది
మార్గంలో నడిపే
భార్గవుడే  రాముడంది

కామెంట్‌లు