దక్షత! అచ్యుతుని రాజ్యశ్రీ

 రాజు తనరాజ్యభారం కొడుకులకి అప్పగించి తనింక అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. "మంత్రి!నాకు పదిమంది కొడుకులు. కానీ ఎవరికి రాజ్యభారం అప్పగించడం అనే ఆలోచన లో ఉన్నాను.వారి యోగ్యత ను ఎలానిర్ణయించాలి?"పరీక్షపెట్టి నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఉపాయం చెప్పాడు.రాజు ఒక చిన్న గుడారం వేయించాడు.కేవలం  పదిమంది మాత్రం కూచునే వీలుంది.చిన్న రెండు ద్వారాలు పెట్టాడు.పిల్లలని అందులో కి పంపి భోజనాలు చేయమన్నాడు.తాను ఎదురుగా ఎత్తు ఐన స్థలంపై మంత్రి తోనిలబడి గమనించసాగాడు.ఇంతలోభొయ్ అంటూ నాలుగు కుక్కలు రాకుమారులు భోజనం చేస్తున్న  గుడారంలో కి దూసుకు వచ్చాయి.ఆఖరి వాడుతప్ప మిగతా తొమ్మిది మంది  పెద్దగా అరుస్తూ కంచాలముందునించి లేచి పారిపోయారు.చిన్న వాడు మాత్రం తను తింటూ ఆకుక్కలకు వేరే పళ్లాలలో తినే అవకాశం  కలిగించాడు. అందుకని అవి తోక ఊపుకుంటూ ఆనందంగా  తినసాగాయి.ఆమరునాడు రాజు  దర్బార్ లో  ఆఖరి రాకుమారుడికి రాజ్యభారం  అప్పగిస్తూ ఇలా అన్నాడు "నిన్న నేను పెట్టిన  పరీక్షలో ఈచిన్నవాడు నెగ్గాడు.కుక్కలు రాగానే  భయంతో మిగతా తొమ్మిది మంది బైట కి పరుగులు తీశారు అన్నంకూడా తినకుండా!అలా ఎలా ఉన్నావు నాయనా?" దాని కి అతనుచెప్పిన జవాబు ఇది"నాన్నా!బహు ప్రాణసుఖాయ"అవికూడా నాలాంటి ప్రాణులే అనే భావం తో వాటిని తినటానికి వీలుగా  పళ్లాలు వాటిముందు నెట్టి నేను తిన్నాను. అందుకే అవి నాజోలికి రాలేదు." "బాబూ!నీరాజ్యంలో జనం సుఖపడుతారు.ఎదుటివారి సుఖంకోసం ఆలోచించే ఉత్తమ పాలకుడివి నీవే"అని అతనికి సింహాసనభారం అప్పగించి కొన్ని రోజుల తర్వాత  వానప్రస్థానానికి వెళ్లి పోయాడు రాజు 🌹
కామెంట్‌లు