నేటిమినీలు ;-కోరాడ నరసింహా రావు

  * ఆశయం సిద్ధిస్తుంది *
             ******
(1)
      ఆశపడితే ధ్యాసపెట్టాలి 
అక్రమంగా కాదు, సక్రమంగా 
    ధర్మం గా ప్రయత్నించు 
        ఆశయం సిద్ది స్తుంది !
పేరాశ, దురాశ ఎంత తప్పో... 
   నిరాశ  అంతే తప్పు !!
      ******
(2)   @కావు  పరిష్కారాలు@
             *****
    గంపెడు దుఃఖాలు... 
       గుప్పెడు సుఖాలు  ఐనా 
  నెట్టుకురావాలి బ్రతుకులు !
         చావమనే నిరాశకన్నా 
బ్రతకాలనే ఆశే గొప్పది !!
ఆత్మహత్య పరిష్కారం కాదుగా
         ******
కామెంట్‌లు